Telugu Global
National

టీకా వేయించుకుంటేనే ఆ గ్రామాల్లోకి ఎంట్రీ..

వ్యాక్సినేషన్ చేయించుకోకపోతే విదేశాలకు వెళ్లే అవకాశం లేదనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు టీకా వేసుకోనివారికి తమ ఊళ్లలోకి నో ఎంట్రీ అనేస్తున్నాయి కొన్ని గ్రామాలు. ఊరిలోవారెవరైనా వ్యాక్సినేషన్ వేయించుకోకపోతే వారికి గ్రామబహిష్కరణే గతి అంటున్నారు సర్పంచ్ లు. అంతేకాదు.. టీకాకు వెనకాడేవారు, టీకా విషయంలో నిర్లక్ష్యంగా ఉండేవారిని ఇక ఏ కార్యక్రమానికి కూడా ఆహ్వానించకూడదని తీర్మానించారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ భోపాల్ ప్రాంతానికి చెందిన రతిబాద్, సర్వార్, సికింద్రాబాద్, ముండ్ల… ఈ 4 పంచాయతీల్లోని 13 గ్రామాల్లో […]

టీకా వేయించుకుంటేనే ఆ గ్రామాల్లోకి ఎంట్రీ..
X

వ్యాక్సినేషన్ చేయించుకోకపోతే విదేశాలకు వెళ్లే అవకాశం లేదనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు టీకా వేసుకోనివారికి తమ ఊళ్లలోకి నో ఎంట్రీ అనేస్తున్నాయి కొన్ని గ్రామాలు. ఊరిలోవారెవరైనా వ్యాక్సినేషన్ వేయించుకోకపోతే వారికి గ్రామబహిష్కరణే గతి అంటున్నారు సర్పంచ్ లు. అంతేకాదు.. టీకాకు వెనకాడేవారు, టీకా విషయంలో నిర్లక్ష్యంగా ఉండేవారిని ఇక ఏ కార్యక్రమానికి కూడా ఆహ్వానించకూడదని తీర్మానించారు.

మ‌ధ్య‌ప్ర‌దేశ్ భోపాల్ ప్రాంతానికి చెందిన రతిబాద్, సర్వార్, సికింద్రాబాద్, ముండ్ల… ఈ 4 పంచాయతీల్లోని 13 గ్రామాల్లో ఈ కరోనా వ్యాక్సిన్ నిబంధన అమలులో ఉంది. ఈ 13 గ్రామాల్లో మొత్తం 15వేల జనాభా ఉంది. వీరిలో దాదాపు 5వేలమంది వ్యాక్సిన్ తీసుకున్నారు. మిగతా వారు వివిధ కారణాలతో దానికి దూరంగా ఉన్నారు. కొంతమంది మూఢ విశ్వాసాలతో వ్యాక్సిన్ వేయించుకోలేదు, ఇంకొంతమందిలో అవగాహన లేదు, మరికొంతమంది భయపడుతున్నారు. అయితే వ్యాక్సిన్ లేకపోతే కరోనాకి బలికావాల్సి వస్తుందని, గ్రామాల్లో ఒక్కరికి వచ్చినా, మిగతా వారంతా ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో సర్పంచ్ లు ఈ నిర్ణయం తీసుకున్నారు.

వ్యాక్సిన్ తీసుకున్నవారికి గ్రామ బహిష్కరణ శిక్ష విధిస్తామని చెప్పారు. దీంతో ఆయా గ్రామాల్లో మంచి ఫలితం కనిపించిందట. గతంలో వ్యాక్సిన్ బృందాలను చూసి చాలామంది ఇంటి తలుపులు మూసుకునేవారని, ఇప్పుడు టీకా బృందం కోసం ఎదురు చూస్తున్నారని చెబుతున్నారు సర్వార్ గ్రామ సర్పంచ్ లాల్ సింగ్ మీనా. భయపెట్టినా, బెదిరించినా, అంతా గ్రామ ప్రజల మేలు కోసమేనంటున్నారు. అంతే కాదు, వ్యాక్సిన్‌ పై గ్రామస్తుల్లో అపోహ‌లు తొల‌గించేందుకు అవ‌గాహ‌నా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు. వ్యాక్సిన్ వేసుకున్నవారికే తమ గ్రామంలోకి ఎంట్రీ అని చెప్పడంతో.. ఆ గ్రామంతో సంబంధం ఉన్నవారు కూడా కచ్చితంగా టీకా తీసుకుంటున్నారని, తమ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా దీని ఫలితం కనిపించిందని అంటున్నారు.

First Published:  10 Jun 2021 2:31 AM IST
Next Story