కోవిడ్ నుంచి కోలుకున్నాక వ్యాయామాలు చేయొచ్చా?
కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత వ్యాయామాలు చేయొచ్చా లేదా అన్న డౌట్ ఇప్పడు చాలామందికి వస్తుంది. ఇమ్యూనిటీ కోసం వ్యాయామాలు చేయాలని డాక్టర్లు చెప్తుండడంతో కోవిడ్ సమయంలో అలాగే కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత హెవీ వర్కవుట్లు చేస్తున్నారు చాలామంది. అసలు ఈ విషయంపై నిపుణులు ఏమంటున్నారంటే.. కోవిడ్ నుంచి కోలుకోగానే వర్కవుట్లు చేయడం అంత మంచిది కాదంటున్నారు నిపుణులు. కోవిడ్‌తో బాధపడుతున్నప్పుడు, కోలుకున్నాక హెవీ వర్కవుట్లు చేయడం గంటలకొద్దీ నడవడం, యోగాసనాలు వేయడం లాంటి వర్కవుట్ల […]
కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత వ్యాయామాలు చేయొచ్చా లేదా అన్న డౌట్ ఇప్పడు చాలామందికి వస్తుంది. ఇమ్యూనిటీ కోసం వ్యాయామాలు చేయాలని డాక్టర్లు చెప్తుండడంతో కోవిడ్ సమయంలో అలాగే కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత హెవీ వర్కవుట్లు చేస్తున్నారు చాలామంది. అసలు ఈ విషయంపై నిపుణులు ఏమంటున్నారంటే..
కోవిడ్ నుంచి కోలుకోగానే వర్కవుట్లు చేయడం అంత మంచిది కాదంటున్నారు నిపుణులు. కోవిడ్‌తో బాధపడుతున్నప్పుడు, కోలుకున్నాక హెవీ వర్కవుట్లు చేయడం గంటలకొద్దీ నడవడం, యోగాసనాలు వేయడం లాంటి వర్కవుట్ల వల్ల శరీరం బలహీన పడుతుందంటున్నారు డాక్టర్లు.
కరోనా తగ్గాక వ్యాయామం చేసే సమయాన్ని వారానికి 5 శాతం చొప్పున పెంచుకుంటూ వెళ్లాలి. అలా కాకుండా కరోనా చికిత్స పొందే సమయంలోగానీ.. కోలుకున్న వెంటనే గానీ తీవ్ర శారీరక శ్రమను చేయడం ద్వారా ప్రాణాపాయ ముప్పును ఎదుర్కోవాల్సిన ఉంటుంది
కోవిడ్ సోకి తగ్గిన తర్వాత శరీరం బాగా బలహీన పడతుంది. ఇలాంటి సమయంలో శరీరానికి మానసిక, శారీరక విశ్రాంతి అవసరం. అందుకే ఆ సమయంలో వ్యాయామాలు చేయకపోవడమే మంచిది. శరీరానికి తగినంత విశ్రాంతినిస్తూ.. ఓ రెండు మూడు నెలల తర్వాత కొద్ది పాటి వ్యాయామాలు మొదలు పెట్టాలి. ఇలా మెల్లగా వ్యాయామాల తీవ్రతను పెంచుకుంటూ.. రెగ్యులర్ వర్కవుట్లు చేసుకోవాలి. అలా కాకుండా శరీరం బలహీనంగా ఉన్నప్పుడు తీవ్రమైన కసరత్తులు చేస్తే జబ్బు తీవ్రత పెరిగే ప్రమాదముంది. దాంతో శరీరానికి ఆక్సిజన్ తీసుకోవడం కష్టంగా మారుతుంది.
ఇలా చేయాలి..
– కోవిడ్ తగ్గిన తర్వాత రెండు వారాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. గదిలో అటూ ఇటూ నడవడం మినహాయించి పెద్ద పెద్ద వ్యాయామాల జోలికి వెళ్లకూడదు.
– రెండు మూడు వారాలు దాటిన తర్వాత మెల్లగా చిన్న చిన్న వర్కవట్లు చేసుకోవచ్చు. అప్పుడు కూడా వీలైతే పల్స్‌ఆక్సీమీటర్‌తో ఆక్సిజన్ లెవల్స్ పరీక్షించుకుంటూ.. వ్యాయామాలు చేయాలి.
– రెండు మూడు వారాల తర్వాత కూడా వ్యాయామాలు చేసేటప్పుడు ఛాతీనొప్పి, గుండె దడ లాంటివి వస్తే.. వెంటనే వ్యాయామాలు ఆపివేయాలి. అవసరమైతే డాక్టర్ను సంప్రదించాలి.
– మధుమేహం, హై బీపీ, ఒబెసిటీ ఉన్న వాళ్లు వ్యాయామాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కనీసం నెల రెండు నెలల వరకూ శరీరానికి విశ్రాంతినిచ్చి ఆ తర్వాత డాక్టర్ల సలహా మేరకు వ్యాయామాలు మొదలుపెట్టాలి.
– అలాగే కోవిడ్ సోకి ఐసొలేషన్‌లో ఉన్నప్పుడు కూడా రోజువారీ పనులు మినహాయించి కష్టతరమైన వర్కవుట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు.