వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్న దర్శకుడు
దర్శకులంతా ఓటీటీపై పడ్డారు. మొన్నటివరకు అవకాశాల్లేని దర్శకులు మాత్రమే ఓటీటీ వైపు వెళ్లారు. ఇప్పుడు కాస్త క్రేజ్ ఉన్న డైరక్టర్లు కూడా ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా దర్శకుడు మారుతి ఇప్పటికే ఒక ఓటీటీ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే దారిలో మరో దర్శకుడు విక్రమ్ కుమార్ కూడా ఉన్నాడు. లాక్ డౌన్ టైమ్ లో విక్రమ్ కుమార్ ఓ వెబ్ సిరీస్ రాసుకున్నాడు. ఆ కథకు సంబంధించి ప్రస్తుతం స్క్రీన్ […]
దర్శకులంతా ఓటీటీపై పడ్డారు. మొన్నటివరకు అవకాశాల్లేని దర్శకులు మాత్రమే ఓటీటీ వైపు వెళ్లారు.
ఇప్పుడు కాస్త క్రేజ్ ఉన్న డైరక్టర్లు కూడా ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా దర్శకుడు
మారుతి ఇప్పటికే ఒక ఓటీటీ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే దారిలో మరో
దర్శకుడు విక్రమ్ కుమార్ కూడా ఉన్నాడు.
లాక్ డౌన్ టైమ్ లో విక్రమ్ కుమార్ ఓ వెబ్ సిరీస్ రాసుకున్నాడు. ఆ కథకు సంబంధించి ప్రస్తుతం స్క్రీన్
ప్లే వర్క్ పూర్తిచేస్తున్నాడు. ఓవైపు నాగచైతన్య హీరోగా థ్యాంక్ యు సినిమా చేస్తూనే, మరోవైపు ఇలా వెబ్
సిరీస్ పనిలో బిజీగా ఉన్నాడు ఈ దర్శకుడు.
ఈ వెబ్ సిరీస్ లో కూడా నాగచైతన్య హీరోగా నటిస్తాడంటూ పుకార్లు వచ్చాయి. వాటిని విక్రమ్ కుమార్
ఖండించాడు. ప్రీ-ప్రొడక్షన్ పూర్తయిన తర్వాత ప్రొడక్షన్ హౌజ్ కు కథను సమర్పిస్తానని.. వాళ్లు హీరోపై ఓ
నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నాడు విక్రమ్ కుమార్.