Telugu Global
Cinema & Entertainment

కెరీర్ పై క్లారిటీ ఇచ్చిన మిల్కీబ్యూటీ

ఓవైపు సినిమాల్లో నటిస్తోంది. మరోవైపు ఓటీటీలో కూడా మెరుస్తోంది. బ్యాక్ టు బ్యాక్ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. దీంతో తమన్న ఇక ఓటీటీకి పరిమితమైపోతుందంటూ కథనాలు రావడం మొదలుపెట్టాయి. వీటిపై తమన్న స్పందించింది. కెరీర్ కు సంబంధించి తన ఫ్యూచర్ ప్లాన్స్ వివరించింది. ఓటీటీకి మాత్రమే పరిమితమైపోతానంటూ వస్తున్న పుకార్లను తమన్న ఖండించింది. మంచి క్యారెక్టర్ దొరికితే సిల్వర్ స్క్రీన్ అయినా, ఓటీటీ అయినా తనకు ఒకటే అంటోంది. ఇకపై సినిమాలు చేస్తూనే, ఓటీటీలో కూడా […]

కెరీర్ పై క్లారిటీ ఇచ్చిన మిల్కీబ్యూటీ
X

ఓవైపు సినిమాల్లో నటిస్తోంది. మరోవైపు ఓటీటీలో కూడా మెరుస్తోంది. బ్యాక్ టు బ్యాక్ వెబ్ సిరీస్ లో
నటిస్తోంది. దీంతో తమన్న ఇక ఓటీటీకి పరిమితమైపోతుందంటూ కథనాలు రావడం మొదలుపెట్టాయి.
వీటిపై తమన్న స్పందించింది. కెరీర్ కు సంబంధించి తన ఫ్యూచర్ ప్లాన్స్ వివరించింది.

ఓటీటీకి మాత్రమే పరిమితమైపోతానంటూ వస్తున్న పుకార్లను తమన్న ఖండించింది. మంచి క్యారెక్టర్
దొరికితే సిల్వర్ స్క్రీన్ అయినా, ఓటీటీ అయినా తనకు ఒకటే అంటోంది. ఇకపై సినిమాలు చేస్తూనే,
ఓటీటీలో కూడా కనిపిస్తానని క్లారిటీ ఇచ్చింది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో సీటీమార్, మ్యాస్ట్రో, ఎఫ్3 లాంటి సినిమాలున్నాయి. ఈ సినిమాలు
కంప్లీట్ చేస్తూనే, మంచి పాత్రలు దొరికితే అటు ఓటీటీలో కూడా నటిస్తానని చెబుతోంది మిల్కీబ్యూటీ.
భవిష్యత్తులో కూడా తన కెరీర్ ఇలానే సాగుతుందని స్పష్టంచేసింది.

First Published:  9 Jun 2021 12:02 PM IST
Next Story