ఆదిపురుష్ సంగీత దర్శకులు వీళ్లే!
ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆదిపురుష్ సినిమాకు సంబంధించి మరో క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే ఈ సినిమాలో నటించే కీలక నటీనటుల ఎంపిక పూర్తిచేసిన యూనిట్, తాజాగా సినిమాకు సంగీత దర్శకుల్ని ఫిక్స్ చేసింది. బాలీవుడ్ లో పలు ప్రాజెక్టులకు సక్సెస్ ఫుల్ ట్యూన్స్ అందించిన సచేత్-పరంపరను ఆదిపురుష్ కోసం తీసుకున్నారు. ఈ సంగీత ద్వయంతో ఇటు ప్రభాస్ కు, అటు ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ కు ఓ ప్రత్యేకమైన కనెక్షన్ ఉంది. అదేంటంటే.. ఇంతకుముందు ఓం […]
ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆదిపురుష్ సినిమాకు సంబంధించి మరో క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే ఈ
సినిమాలో నటించే కీలక నటీనటుల ఎంపిక పూర్తిచేసిన యూనిట్, తాజాగా సినిమాకు సంగీత దర్శకుల్ని
ఫిక్స్ చేసింది. బాలీవుడ్ లో పలు ప్రాజెక్టులకు సక్సెస్ ఫుల్ ట్యూన్స్ అందించిన సచేత్-పరంపరను
ఆదిపురుష్ కోసం తీసుకున్నారు.
ఈ సంగీత ద్వయంతో ఇటు ప్రభాస్ కు, అటు ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ కు ఓ ప్రత్యేకమైన కనెక్షన్
ఉంది. అదేంటంటే.. ఇంతకుముందు ఓం రౌత్ తీసిన తానాజీ సినిమాకు వీళ్లే సంగీతం అందించారు. ఇక
ప్రభాస్ విషయానికొస్తే.. సాహో సినిమాకు ఓ పాటకు వీళ్లే ట్యూన్ కట్టారు. అదే సైకో సయ్యాన్ పాట.
ఆదిపురుష్ కు సంబంధించి ఇప్పటివరకు ఒక షెడ్యూల్ పూర్తయింది. షూటింగ్స్ కు అనుమతి ఇచ్చిన
వెంటనే హైదరాబాద్ లో సెకెండ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తారు. సినిమాలో ప్రభాస్ రాముడిగా
కనిపించబోతున్నాడు. సీత పాత్రలో కృతి సనన్ కనిపించనుంది.