ఓటీటీలోకి ఎంటరైన దర్శకుడు మారుతి
దర్శకుడు మారుతి ఓటీటీలోకి ఎంటరయ్యాడు. ఇన్నాళ్లూ ఓటీటీ కోసం తన కంటెంట్ ను మాత్రమే ఇచ్చిన ఈ దర్శకుడు.. ఇప్పుడు ఏకంగా తానే దర్శకుడిగా ఓటీటీ సినిమా చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈరోజు బయటకొచ్చాయి. రీసెంట్ గా ఏక్ మినీ కథ అనే సినిమాతో సక్సెస్ అందుకున్న సంతోష్ శోభన్ ను హీరోగా పెట్టి మారుతి ఓ చిన్న సినిమా ప్లాన్ చేశాడు. ఇందులో మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తుంది. వచ్చే నెల నుంచి […]
దర్శకుడు మారుతి ఓటీటీలోకి ఎంటరయ్యాడు. ఇన్నాళ్లూ ఓటీటీ కోసం తన కంటెంట్ ను మాత్రమే
ఇచ్చిన ఈ దర్శకుడు.. ఇప్పుడు ఏకంగా తానే దర్శకుడిగా ఓటీటీ సినిమా చేయబోతున్నాడు. దీనికి
సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈరోజు బయటకొచ్చాయి.
రీసెంట్ గా ఏక్ మినీ కథ అనే సినిమాతో సక్సెస్ అందుకున్న సంతోష్ శోభన్ ను హీరోగా పెట్టి మారుతి ఓ
చిన్న సినిమా ప్లాన్ చేశాడు. ఇందులో మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తుంది. వచ్చే నెల నుంచి షూటింగ్
ప్రారంభించి నెల రోజుల్లో సినిమా కంప్లీట్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు మారుతి.
అల్లు అరవింద్ కు చెందిన ఆహా సంస్థ సహకారంతో మారుతి ఈ సినిమా చేస్తున్నట్టు తెలుస్తోంది. అంటే
ఈ మూవీ ఆహా కోసం అన్నమాట. ప్రస్తుతం ఈ దర్శకుడి చేతిలో గోపీచంద్ హీరోగా పక్కా కమర్షియల్ అనే
సినిమా ఉంది. ఆ మూవీని పక్కనపెట్టి మరీ ఆహా కోసం ఇలా ఓటీటీ మూవీ చేస్తున్నాడు మారుతి.