చర్మ వ్యాధులొస్తున్నాయ్ జాగ్రత్త!
కరోనా నుంచి కోలుకున్నాక చాలామందికి చర్మ వ్యాధులు సోకుతున్నట్టు వైద్యులు గుర్తించారు. శరీరం కోవిడ్ బారిన పడితే రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. దీంతో రకరకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడుతాయి. అయితే ఇటీవల వస్తున్న కేసుల్లో చర్మవ్యాధులు, జుట్టు రాలడం లాంటి సమస్యలు ఎక్కువగా ఉంటున్నట్టు డాక్టర్లు చెప్తున్నారు. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత కొందరు చర్మ సమస్యలతో ఆసుపత్రులకు వస్తున్నారని డాక్టర్లు చెప్తున్నారు. గతంలో ఉన్న చర్మవ్యాధులు తిరగబెట్టడం లేదా కొత్త సమస్యలు రావడం ఇటీవల […]
కరోనా నుంచి కోలుకున్నాక చాలామందికి చర్మ వ్యాధులు సోకుతున్నట్టు వైద్యులు గుర్తించారు. శరీరం కోవిడ్ బారిన పడితే రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. దీంతో రకరకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడుతాయి. అయితే ఇటీవల వస్తున్న కేసుల్లో చర్మవ్యాధులు, జుట్టు రాలడం లాంటి సమస్యలు ఎక్కువగా ఉంటున్నట్టు డాక్టర్లు చెప్తున్నారు.
కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత కొందరు చర్మ సమస్యలతో ఆసుపత్రులకు వస్తున్నారని డాక్టర్లు చెప్తున్నారు. గతంలో ఉన్న చర్మవ్యాధులు తిరగబెట్టడం లేదా కొత్త సమస్యలు రావడం ఇటీవల ఎక్కువైందంటున్నారు. చర్మంపై తెల్లటి మచ్చలొచ్చే క్యాండిడా ఫంగస్ అలాగే హెర్పస్ అనే చర్మ సమస్యలు కోవిడ్ తర్వాత వచ్చే అవకాశం ఉంది. వీటతో పాటు మహిళల్లో జుట్టు రాలడం, గోళ్ల సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. అయితే సాధారణంగా వచ్చే చర్మ సమస్యల్లో చర్మంపై బొబ్బలు, ఎర్రని దద్దుర్లు లాంటివి కనిపిస్తాయి. అయితే వీటికి బ్లాక్ ఫంగస్ కు ఎలాంటి సంబంధం లేదు. చాలా మంది చర్మ సమస్యలను బ్లాక్ ఫంగస్ అని భయపడుతున్నారని డాక్టర్లు చెప్తున్నారు.
కోవిడ్ తర్వాత చర్మ సమస్యలు తలెత్తితే ఎలాంటి భయం లేకుండా స్కిన్ డాక్టర్ ను సంప్రదించాలి. ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తున్నాయి కాబట్టి ఇమ్యూనిటీ ఫుడ్ ను అలాగే హెల్దీ లైఫ్ స్టైల్ లు కొనసాగించాలి. కోవిడ్ సమయంలో కేర్ తీసుకున్నట్టే కోవిడ్ తర్వాత కూడా సరైన జాగ్రత్తలు తీసుకుంటే పోస్ట్ కోవిడ్ సమస్యలను అధిగమించొచ్చు.