Telugu Global
NEWS

తెలంగాణ లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..

తెలంగాణలో లాక్ డౌన్ మరో రెండ్రోజుల్లో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో రేపు జరబోతున్న కేబినెట్ భేటీలో కర్ఫ్యూ సడలింపుపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మధ్యాహ్నం 1గంటల వరకు ఉన్న సడలింపుని సాయంత్రం 5 గంటల వరకు పెంచాలని అనుకుంటున్నారు అధికారులు. సాయంత్రం 6నుంచి మరుసటిరోజు తెల్ల‌వారుజాము 6 గంటల వరకు పూర్తిగా 12గంటలపాటు కఠిన లాక్ డౌన్ అమలు చేయాలని భావిస్తున్నారు. మంత్రివర్గ భేటీలో దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన చేస్తారు. ప్రస్తుతం కరోనా […]

తెలంగాణ లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..
X

తెలంగాణలో లాక్ డౌన్ మరో రెండ్రోజుల్లో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో రేపు జరబోతున్న కేబినెట్ భేటీలో కర్ఫ్యూ సడలింపుపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మధ్యాహ్నం 1గంటల వరకు ఉన్న సడలింపుని సాయంత్రం 5 గంటల వరకు పెంచాలని అనుకుంటున్నారు అధికారులు. సాయంత్రం 6నుంచి మరుసటిరోజు తెల్ల‌వారుజాము 6 గంటల వరకు పూర్తిగా 12గంటలపాటు కఠిన లాక్ డౌన్ అమలు చేయాలని భావిస్తున్నారు. మంత్రివర్గ భేటీలో దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన చేస్తారు.

ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఆంక్షలను మరింత సడలించాలని ప్రభుత్వం భావిస్తోంది. అనుమతి వేళలను సాయంత్రం 5 గంటల వరకు పెంచి, కార్యాలయాలు, పనులపై బయటకు వచ్చినవారు ఇళ్లకు తిరిగి వెళ్లడానికి మరో గంట అనుమతించాలనుకుంటోంది. వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలు, ఆదాయం పెరగాల్సిన అవసరం.. దృష్ట్యా లాక్‌డౌన్‌ సడలింపు అనివార్యమని ప్రభుత్వం భావిస్తోంది. సాయంత్రం 5 గంటల వరకు వెసులుబాటు ఇస్తే రిజిస్ట్రేషన్లు, రవాణా, ఆబ్కారీ తదితర శాఖల ద్వారా మరింత ఆదాయం సమకూరుతుందనేది నేతల ఆలోచన. లాక్‌ డౌన్‌ వల్ల కరోనా కేసులు ఏమేరకు తగ్గాయి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఏ మేరకు ప్రభావితమైందనే అంశాలపై ఆర్థిక, వైద్య ఆరోగ్యం, పోలీసు, ఆబ్కారీ, వాణిజ్య పన్నులు, రెవెన్యూ తదితర శాఖల నుంచి సీఎం నివేదికలు కోరారు. దీనిపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు.

థర్డ్ వేవ్ పై తెలంగాణ దృష్టి..
సెకండ్ వేవ్ ప్రారంభంలో కర్ఫ్యూని లైట్ తీసుకున్న తెలంగాణ సర్కారు, ఆ తర్వాత కోర్టు అక్షింతలతో అన్యమనస్కంగానే లాక్ డౌన్ పెట్టింది. అయితే లాక్ డౌన్ తో ఫలితాలు స్పష్టంగా కనిపించడంతో పొడిగిస్తూ వచ్చింది. ఆంక్షల అమలుతో పాటు హైరిస్క్‌ ఉన్నవారికి టీకాల కార్యక్రమం పెద్దఎత్తున నిర్వహిస్తోంది. ఐటీ ఉద్యోగులు, ఇతరులకూ వ్యాక్సిన్లు పెద్దసంఖ్యలో వేస్తున్నారు. పరీక్షలను ముమ్మరం చేశారు. రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత కూడా తగ్గింది. అయితే మూడో దశ హెచ్చరికల నేపథ్యంలో.. ప్రభుత్వం ప్రత్యేకంగా చిన్నపిల్లల వైద్యంపై శ్రద్ధ పెట్టింది. నీలోఫర్ ఆస్పత్రిలో వెయ్యి పడకలు చిన్నారులకోసం ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం కేసుల సంఖ్య తగ్గుతుండటంతో.. ఆంక్షలు సడలించే దిశగా అడుగులు వేస్తోంది తెలంగాణ సర్కార్.

First Published:  7 Jun 2021 3:33 AM IST
Next Story