Telugu Global
Cinema & Entertainment

ప్రభాస్ హీరోయిన్ పెళ్లి చేసుకుంది

ఎవ్లీన్ శర్మ ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాకు చెందిన డాక్టర్ తుషాన్ ను 2018 నుంచి ప్రేమిస్తోంది. 2019లో వీళ్ల ఎంగేజ్ మెంట్ కూడా పూర్తయింది. ఇప్పుడు ఈ ఇద్దరూ పెళ్లితో ఒకటయ్యారు. మే 15న ఎవ్లీన్-తుషాన్ పెళ్లి చేసుకున్నారు. ఆ విషయాన్ని ఈరోజు ప్రకటించింది ఈ ముద్దుగుమ్మ. కొన్ని ఫొటోలు కూడా రిలీజ్ చేసింది. రణబీర్ కపూర్ హీరోగా నటించిన యే జవానీ హే దీవాని సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది ఎవ్లీన్. ఆ తర్వాత […]

ప్రభాస్ హీరోయిన్ పెళ్లి చేసుకుంది
X

ఎవ్లీన్ శర్మ ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాకు చెందిన డాక్టర్ తుషాన్ ను 2018 నుంచి
ప్రేమిస్తోంది. 2019లో వీళ్ల ఎంగేజ్ మెంట్ కూడా పూర్తయింది. ఇప్పుడు ఈ ఇద్దరూ పెళ్లితో ఒకటయ్యారు.
మే 15న ఎవ్లీన్-తుషాన్ పెళ్లి చేసుకున్నారు. ఆ విషయాన్ని ఈరోజు ప్రకటించింది ఈ ముద్దుగుమ్మ. కొన్ని
ఫొటోలు కూడా రిలీజ్ చేసింది.

రణబీర్ కపూర్ హీరోగా నటించిన యే జవానీ హే దీవాని సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది ఎవ్లీన్. ఆ తర్వాత
హిందీ మీడియం లాంటి మంచి సినిమాల్లో నటించింది. ఇక ప్రభాస్ సరసన సాహో సినిమాలో నటించి
సౌత్ లో కూడా గుర్తింపు తెచ్చుకుంది.

అయితే ఆమెకు బాలీవుడ్, సౌత్ నుంచి పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో తుషాన్ తో కొన్నేళ్లుగా
సిడ్నీలోనే ఉంటున్న ఎవ్లీన్, ఇప్పుడు పెళ్లి చేసుకొని పూర్తిగా లైఫ్ లో సెటిలైంది.

First Published:  7 Jun 2021 12:11 PM IST
Next Story