Telugu Global
Health & Life Style

కొవిడ్ చికిత్సలో ఆ రెండు మాత్రలు వద్దు..

కరోనా చికిత్స పూర్తిగా ట్రైల్ అండ్ ఎర్రర్ మెథడ్ ప్రకారమే జరుగుతోందనడానికి ఇప్పటి వరకు చాలా ఉదాహరణలున్నాయి. మొదట్లో ఇవే దివ్యౌషధాలు అని అనుకున్నవాటిని తర్వాత పూర్తిగా పక్కనపెట్టేశారు వైద్యులు. అత్యవసరం అన్న అజిత్రోమైసిన్ వంటి ఔషధాలను కూడా వద్దని చెప్పేశారు. బ్లాక్ మార్కెట్లో విపరీతంగా రేటు పెరిగిన మందులు కూడా.. రాను రాను అసలు అవసరం లేకుండా పోయాయి. వాటిని పూర్తిగా వాడొద్దని సైతం తేల్చి చెప్పారు నిపుణులు. అధికారికంగా కేంద్ర ఆరోగ్య శాఖ కూడా […]

కొవిడ్ చికిత్సలో ఆ రెండు మాత్రలు వద్దు..
X

కరోనా చికిత్స పూర్తిగా ట్రైల్ అండ్ ఎర్రర్ మెథడ్ ప్రకారమే జరుగుతోందనడానికి ఇప్పటి వరకు చాలా ఉదాహరణలున్నాయి. మొదట్లో ఇవే దివ్యౌషధాలు అని అనుకున్నవాటిని తర్వాత పూర్తిగా పక్కనపెట్టేశారు వైద్యులు. అత్యవసరం అన్న అజిత్రోమైసిన్ వంటి ఔషధాలను కూడా వద్దని చెప్పేశారు. బ్లాక్ మార్కెట్లో విపరీతంగా రేటు పెరిగిన మందులు కూడా.. రాను రాను అసలు అవసరం లేకుండా పోయాయి. వాటిని పూర్తిగా వాడొద్దని సైతం తేల్చి చెప్పారు నిపుణులు.

అధికారికంగా కేంద్ర ఆరోగ్య శాఖ కూడా చాలా మందుల్ని కొవిడ్ చికిత్స నుంచి తొలగిస్తూ వస్తోంది. ఆమధ్య ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా కరోనా చికిత్సనుంచి రెమిడిసెవిర్ తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత కేంద్ర ఆరోగ్య‌శాఖకు చెందిన డైరెక్ట‌రేట్ జ‌న‌ర‌ల్ ఆఫ్ హెల్త్ స‌ర్వీసెస్ (డీజీహెచ్ఎస్‌) కూడా రెమిడిసెవిర్ వాడకం అవసరం లేదని చెప్పింది. అంతకు ముందే ప్లాస్మా థెరపీని పూర్తిగా కొవిడ్ చికిత్స ప్రొటోకాల్ నుంచి తొలగించింది. తాజాగా.. స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉన్న వాళ్ల‌కు కొవిడ్ చికిత్స కోసం వాడుతున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్‌, ఐవ‌ర్‌ మెక్టిన్, డాక్సీసైక్లిన్‌, జింక్‌, మ‌ల్టీ విట‌మిన్ల వంటి ట్యాబ్లెట్లు అవ‌స‌రం లేదని తేల్చి చెప్పింది డీజీహెచ్ఎస్‌.

స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉన్న వాళ్లు యాంటీ పైరెటిక్‌, యాంటీ ట్యూసివ్ మందులు మాత్ర‌మే వాడాల‌ని చెప్పింది. కొవిడ్ లక్షణాలు తీవ్రంగా లేనివారు జ్వ‌రం తగ్గడానికి యాంటీపైరెటిక్‌, జ‌లుబు తగ్గేందుకు యాంటీట్యూసివ్ మందులు మాత్రం వాడితే చాల‌ని తెలిపింది. అవ‌న‌సరంగా పేషెంట్ల‌కు సీటీ స్కాన్లు చేయించొద్ద‌ని డాక్ట‌ర్ల‌కు సూచించింది. కొవిడ్‌ను అడ్డుకోవ‌డానికి మాస్కులు ధ‌రించ‌డం, చేతులు శుభ్రంగా ఉంచుకోవ‌డం, భౌతిక దూరం పాటించ‌డం త‌ప్ప‌నిస‌రిగా చేయాల‌ని స్ప‌ష్టం చేసింది.

ల‌క్ష‌ణాలు లేని వాళ్ల‌కు అస‌లు ఎలాంటి మందులు అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేసిన డీజీహెచ్ఎస్ దీర్ఘ‌కాలిక వ్యాధులతో బాధ‌ప‌డుతున్న వాళ్ల‌యితే మాత్రం తాము వాడుతున్న మందుల‌ను కొన‌సాగించాల‌ని సూచించింది. స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉన్న వాళ్లు ఎప్ప‌టిక‌ప్పుడు జ్వ‌రం, ఆక్సిజ‌న్ శాచురేషన్ వంటివి చెక్ చేసుకుంటూ ఉండాల‌ని సూచించింది. ద‌గ్గు ఉంటే ఐదు రోజుల పాటు ఆవిరి కోసం బుడెసొనైడ్ 800 ఎంసీజీ డోసు రోజుకు రెండుసార్లు వాడాల‌ని చెప్పింది.

First Published:  7 Jun 2021 5:03 AM GMT
Next Story