కోవాగ్జిన్ కాదు.. కోవిషీల్డే బాగా పనిచేస్తుందట.. సంచలన రిపోర్ట్..!
దేశీయ టెక్నాలజీతో తయారైన కోవాగ్జిన్ బాగా పనిచేస్తుందా? లేదంటే విదేశీ టెక్నాలజీతో మన దేశంలో తయారైన కోవిషీల్డ్ బాగా పనిచేస్తుందా? చాలా రోజులుగా మనదేశ ప్రజలను ప్రశ్నగా మారింది. కోవాగ్జిన్ ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని వార్తలు రావడంతో ప్రజలు దాని కోసం ఎగబడ్డారు. అయితే ఇప్పటివరకు డబ్ల్యూహెచ్ వో కోవాగ్జిన్‌కు గుర్తింపు ఇవ్వలేదు. మరోవైపు కోవాగ్జిన్ వేసుకున్న వాళ్లు తమ దేశానికి రావడానికి వీళ్లేందంటూ అమెరికా ఆంక్షలు విధించింది. కోవిషీల్డ్ తీసుకున్న భారతీయులకు మాత్రమే అనుమతి ఇచ్చింది అమెరికా.. […]
దేశీయ టెక్నాలజీతో తయారైన కోవాగ్జిన్ బాగా పనిచేస్తుందా? లేదంటే విదేశీ టెక్నాలజీతో మన దేశంలో తయారైన కోవిషీల్డ్ బాగా పనిచేస్తుందా? చాలా రోజులుగా మనదేశ ప్రజలను ప్రశ్నగా మారింది. కోవాగ్జిన్ ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని వార్తలు రావడంతో ప్రజలు దాని కోసం ఎగబడ్డారు.
అయితే ఇప్పటివరకు డబ్ల్యూహెచ్ వో కోవాగ్జిన్‌కు గుర్తింపు ఇవ్వలేదు. మరోవైపు కోవాగ్జిన్ వేసుకున్న వాళ్లు తమ దేశానికి రావడానికి వీళ్లేందంటూ అమెరికా ఆంక్షలు విధించింది. కోవిషీల్డ్ తీసుకున్న భారతీయులకు మాత్రమే అనుమతి ఇచ్చింది అమెరికా.. దీంతో మరోసారి కోవిషీల్డ్ బాగా పనిచేస్తుందంటూ ప్రచారం ఊపందుకున్నది.
ఈ నేపథ్యంలో ఈ రెండు వ్యాక్సిన్లు ప్రభావంతంగానే పనిచేస్తున్నాయని.. మరణాల రేటును గణనీయంగా తగ్గిస్తాయని.. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లకు కరోనా సోకినా.. అంతగా ప్రభావం ఉండదని శాస్త్రవేత్తలు చెబుతూ వచ్చారు. అయినప్పటికీ ప్రజల్లో సందేహాలు మాత్రం అలాగే ఉండిపోయాయి. తాజాగా ఇప్పుడో అధ్యయనం వెలుగులోకి వచ్చింది.
ఈ అధ్యయనం ప్రకారం.. కోవాగ్జిన్ కంటే కోవిషీల్డ్ ప్రభావంతంగా పనిచేస్తుందని తెలిసింది. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ స్వదేశీ టెక్నాలజీతో కోవాగ్జిన్ ను తయారు చేసిన విషయం తెలిసిందే. ఇక పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్.. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రూపొందించిన కోవిషీల్డ్‌ను తయారుచేస్తున్నది. ఈ రెండు వ్యాక్సిన్ల పనితీరుపై తాజాగా ఓ సంస్థ అధ్యయనం జరిపింది.
ఈ సంస్థ మొత్తం 515 మందిలో కోవాగ్జిన్, కోవిషీల్డ్ ఎలా పనితీరు ఎలా ఉంది? అనే విషయం మీద అధ్యయనం జరిపింది. వారిలో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత యాంటీబాడీస్ ఏ మేరకు వృద్ధి చెందాయి. అనే విషయం మీద పరిశోధన జరిపింది. అయితే కోవిషీల్డ్ తీసుకున్న వారిలో 98.1 శాతం యాంటిబాడీస్, రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందగా.. కోవాగ్జిన్ తీసుకున్న వారిలో 80 శాతం మంది యాంటీబాడీస్ అభివృద్ధి చెందాయి. అయితే కోవాగ్జిన్ తో పోల్చిచూస్తే.. కోవిషీల్డ్ ప్రభావవంతంగా పనిచేస్తోందని శాస్త్రవేత్త ఏకే సింగ్ అంటున్నారు.