రామ్ చరణ్ ఓపెన్ లెటర్
అభిమానులకు రామ్ చరణ్ ఓపెన్ లెటర్ రాయడం కొత్త కాదు. ఇంతకుముందు పలుమార్లు ఇలానే చేశాడు. ఇప్పుడు మరోసారి అభిమానులకు బహిరంగ లేఖ రాశాడు ఈ మెగా హీరో. ఇంతకీ అందులో విషయం ఏంటో చూద్దాం.. “మెగా అభిమానులు ఈ కరోనా మహమ్మారి టైమ్ లో కష్టపడి చేస్తున్న సమాజ సేవ గురించి నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నాను. అత్యవసర పరిస్థితిలో ఉన్న సామాన్యుడికి సహాయం చేయడం నుంచి ఎన్నో సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడం వరకు మీరు […]
అభిమానులకు రామ్ చరణ్ ఓపెన్ లెటర్ రాయడం కొత్త కాదు. ఇంతకుముందు పలుమార్లు ఇలానే
చేశాడు. ఇప్పుడు మరోసారి అభిమానులకు బహిరంగ లేఖ రాశాడు ఈ మెగా హీరో. ఇంతకీ అందులో
విషయం ఏంటో చూద్దాం..
“మెగా అభిమానులు ఈ కరోనా మహమ్మారి టైమ్ లో కష్టపడి చేస్తున్న సమాజ సేవ గురించి నేను
ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నాను. అత్యవసర పరిస్థితిలో ఉన్న సామాన్యుడికి సహాయం చేయడం
నుంచి ఎన్నో సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడం వరకు మీరు ఎంతో అంకిత భావంతో పనిచేశారు. ఎన్నో
వ్యవప్రయాసలకోర్చి ఎందరికో సహాయం చేసిన మీ అందరికీ పేరు పేరునా నా శుభాభినందనలు. మీ
అందరి అంకిత భావానికి నా ధన్యవాదాలు.”
ఇలా అభిమానులు చేస్తున్న సేవా కార్యక్రమాల్ని బహిరంగంగా మెచ్చుకున్నాడు చరణ్. ఇప్పటికే బ్లడ్
బ్యాంక్ నిర్వహిస్తున్న చిరంజీవి, తాజాగా ఆక్సిజన్ బ్యాంకు కూడా ఏర్పాటుచేశారు. దీనికోసం తెలుగు
రాష్ట్రాల్లోని మెగాభిమానులు చాలా కష్టపడ్డారు. ఆ పనులన్నింటినీ చరణ్ దగ్గరుండి చూసుకున్నాడు.
వాళ్లందరికీ ఇలా థ్యాంక్స్ చెప్పాడు చరణ్.