Telugu Global
NEWS

పరీక్షలు రద్దు చేసే ప్రసక్తే లేదు..!

కరోనా పరిస్థితుల నేపథ్యంలో పలు రాష్ట్రాలు పదో తరగతి, ఇంటర్ పరీక్షలను రద్దు చేశాయి. ఏపీలో కూడా టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని పలువురు కోరుతూ వచ్చారు. అయితే ప్రభుత్వం మాత్రం ఏది ఏమైనా పరీక్షలు జరిపి తీరుతామని చెబుతూ వస్తోంది. అయితే కరోనా కారణంగా టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణను ప్రభుత్వం వాయిదా వేసింది. ఇప్పటికి కూడా కరోనా తీవ్రత తగ్గక పోవడంతో అసలు పరీక్షలు నిర్వహిస్తారా.. లేదా అన్న సందేహాలు నెలకొన్నాయి. ఈ […]

పరీక్షలు రద్దు చేసే ప్రసక్తే లేదు..!
X

కరోనా పరిస్థితుల నేపథ్యంలో పలు రాష్ట్రాలు పదో తరగతి, ఇంటర్ పరీక్షలను రద్దు చేశాయి. ఏపీలో కూడా టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని పలువురు కోరుతూ వచ్చారు. అయితే ప్రభుత్వం మాత్రం ఏది ఏమైనా పరీక్షలు జరిపి తీరుతామని చెబుతూ వస్తోంది.

అయితే కరోనా కారణంగా టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణను ప్రభుత్వం వాయిదా వేసింది. ఇప్పటికి కూడా కరోనా తీవ్రత తగ్గక పోవడంతో అసలు పరీక్షలు నిర్వహిస్తారా.. లేదా అన్న సందేహాలు నెలకొన్నాయి. ఈ పరీక్షల నేపథ్యంలో ఏపీలో పదోతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేసే ప్రసక్తే లేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు మరోసారి స్పష్టం చేశారు.

ప్రస్తుతం కోవిడ్​ కారణంగా పరీక్షలను వాయిదా వేశామని.. కరోనా తగ్గిన వెంబడే కచ్చితంగా పరీక్షలను నిర్వహించి తీరుతామని చెప్పారు. పరీక్షలు రద్దు చేయాలంటూ తల్లిదండ్రుల నుంచి ఎటువంటి డిమాండ్​ లేదని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయని.. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పరీక్షలు వాయిదా వేశామన్నారు. కోవిడ్​ ఉదృతి తగ్గాక కచ్చితంగా పరీక్షలు నిర్వహించి తీరుతామని ఆయన చెప్పారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎంపీ భరత్​తో కలిసి రాజమండ్రిలో ఆయన మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పరీక్షలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఇతర రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఏపీ సీఎం జగన్​ మోహన్​రెడ్డి మాత్రం విద్యార్థుల భవిష్యత్​ను దృష్టిలో ఉంచుకొని పరీక్షలు నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు.

First Published:  5 Jun 2021 8:02 AM IST
Next Story