Telugu Global
NEWS

వైఎస్సార్​ కాంగ్రెస్​ కే అన్నిహక్కులు.. 'అన్న వైఎస్సార్‌' పిటిషన్‌ కొట్టివేత..!

జగన్​ నేతృత్వంలోని వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ గుర్తింపు రద్దు చేయాలంటూ.. అన్న వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడు మహబూబ్ బాషా ఢిల్లీ హైకోర్టులో పిటిష‌న్ వేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం అప్పట్లో సంచలనంగా మారింది. ఈ పిటిషన్​పై పలుమార్లు ఢిల్లీ హైకోర్టులో వాదనలు కొనసాగాయి. చివరకు ఇవాళ తీర్పు వచ్చింది. జగన్​ నేతృత్వంలోని వైఎస్సార్​ కాంగ్రెస్​కు అనుకూలంగా తీర్పు వచ్చింది. వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ పేరు, గుర్తు సహా సర్వ హక్కులు సీఎం జగన్​ నేతృత్వంలోని […]

వైఎస్సార్​ కాంగ్రెస్​ కే అన్నిహక్కులు.. అన్న వైఎస్సార్‌ పిటిషన్‌ కొట్టివేత..!
X

జగన్​ నేతృత్వంలోని వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ గుర్తింపు రద్దు చేయాలంటూ.. అన్న వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడు మహబూబ్ బాషా ఢిల్లీ హైకోర్టులో పిటిష‌న్ వేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం అప్పట్లో సంచలనంగా మారింది. ఈ పిటిషన్​పై పలుమార్లు ఢిల్లీ హైకోర్టులో వాదనలు కొనసాగాయి. చివరకు ఇవాళ తీర్పు వచ్చింది.

జగన్​ నేతృత్వంలోని వైఎస్సార్​ కాంగ్రెస్​కు అనుకూలంగా తీర్పు వచ్చింది. వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ పేరు, గుర్తు సహా సర్వ హక్కులు సీఎం జగన్​ నేతృత్వంలోని పార్టీకే ఉంటాయని కోర్టు స్పష్టం చేసింది.

నిజానికి అన్న వైఎస్సార్​ కాంగ్రెస్​ అనే ఓ పార్టీ ఉందని ఏపీలో చాలా మందికి తెలియదు. ఆ పార్టీకి పెద్దగా ఓట్లశాతం కూడా లేదు. కానీ ఓ వర్గం మీడియా ఈ అంశానికి హైప్​ ఇవ్వడం.. వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ రద్దు అవుతుందని అన్న స్థాయిలో ప్రచారం సాగడంతో ఈ విషయం సంచలనంగా మారింది. ఎట్టకేలకు ఉత్కంఠకు తెరపడింది. దీంతో వైసీపీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అన్న వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడు బాషా కోర్టులో వాదనలు వినిపిస్తూ.. వైఎస్సార్​ అనే పేరును తాను ముందుగా రిజిస్టర్​ చేసుకున్నాను కాబట్టి.. దీనిమీద పూర్తిహక్కులు తనకే ఉంటాయని కోర్టులో వాదనలు వినిపించారు.

మరోవైపు తప్పుడు ఉద్దేశాలతో ఈ కేసు వేశారని.. వైఎస్సార్​ కాంగ్రెస్​ తరఫున న్యాయవాది కోర్టుకు వివరించారు. పలు దఫాలుగా ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు అన్న వైఎస్సార్​ కాంగ్రెస్​ వేసిన పిటిషన్​ను కొట్టేసింది.

First Published:  4 Jun 2021 4:40 AM GMT
Next Story