Telugu Global
Cinema & Entertainment

శ్రీదేవి అనుకుంటే సమంత వచ్చింది

శాకుంతలం సినిమాకు సంబంధించి శ్రీదేవికి, సమంతకు లింక్ పెట్టాడు దర్శకుడు గుణశేఖర్. శాకుంతలం పై రీసెర్చ్ చేస్తున్నప్పుడు.. ప్రీ-ప్రొడక్షన్ టైమ్ లో తన కళ్లముందు శ్రీదేవి కదలాడిందని చెప్పుకొచ్చాడు. అయితే ఆమె ఈ లోకంలో లేదు. దీంతో ఆమె స్థానంలో సమంతను తీసుకున్నామంటున్నాడు ఈ దర్శకుడు. “శాకుంతలం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ ఏడాది పాటు చేశాం. ఆ టైమ్ లో శ్రీదేవి లాంటి హీరోయిన్ అయితే బాగుంటుందని అనిపించింది. కానీ శ్రీదేవి మనకు లేరు కదా. ఎవర్ని తీసుకుందామా […]

శ్రీదేవి అనుకుంటే సమంత వచ్చింది
X

శాకుంతలం సినిమాకు సంబంధించి శ్రీదేవికి, సమంతకు లింక్ పెట్టాడు దర్శకుడు గుణశేఖర్.
శాకుంతలం పై రీసెర్చ్ చేస్తున్నప్పుడు.. ప్రీ-ప్రొడక్షన్ టైమ్ లో తన కళ్లముందు శ్రీదేవి కదలాడిందని
చెప్పుకొచ్చాడు. అయితే ఆమె ఈ లోకంలో లేదు. దీంతో ఆమె స్థానంలో సమంతను
తీసుకున్నామంటున్నాడు ఈ దర్శకుడు.

“శాకుంతలం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ ఏడాది పాటు చేశాం. ఆ టైమ్ లో శ్రీదేవి లాంటి హీరోయిన్ అయితే
బాగుంటుందని అనిపించింది. కానీ శ్రీదేవి మనకు లేరు కదా. ఎవర్ని తీసుకుందామా అని ఆలోచిస్తుంటే,
మా అమ్మాయి వచ్చి సమంత పేరు చెప్పింది. అప్పటివరకు నా దృష్టిలో సమంత అంటే అల్ట్రా గ్లామరస్.
అలాంటి అమ్మాయిని శకుంతల పాత్రలో ఊహించుకోలేకపోయాను. అయితే ఎప్పుడైతే రంగస్థలంలో
రామలక్ష్మి పాత్రలో సమంతను చూశానో అప్పుడు నాకు నమ్మకం వచ్చింది. ఓ క్యారెక్టర్ కోసం సమంత
ఎంతైనా కష్టపడుతుందనే విషయం తెలిసొచ్చింది.”

సింగిల్ సిట్టింగ్ లో సమంత ఈ కథకు ఓకే చెప్పిందంటున్నాడు గుణశేఖర్. కథ విన్న వెంటనే సినిమా
చేస్తానని చెప్పకుండా.. ఈ పాత్ర కోసం ఏం చేయాలో చెప్పండి అని సమంత అడగడం తనకు బాగా
నచ్చిందన్నాడు గుణశేఖర్.

First Published:  4 Jun 2021 2:31 PM IST
Next Story