Telugu Global
NEWS

కన్నడిగులకు సారీ చెప్పిన గూగుల్​.. విషయం ఏమిటంటే?

ప్రస్తుతం ఏ సమాచారం కావాలన్నా గూగుల్​లో వెదకడం అందరికీ అలవాటుగా మారిపోయింది. ఇంటర్నెట్ వినియోగం పెరిగిపోయాక ప్రతి అంశాన్ని గూగుల్​లో చూస్తున్నాం. ఇదిలా ఉంటే గూగుల్​ అప్పడప్పుడూ మనకు తప్పుడు సమాచారాలు ఇస్తూ ఉంటుంది. అందుకు గూగుల్​లో ప్రత్యేక అల్గారిథమ్స్​ కారణం కావచ్చు. కొన్ని కొన్ని సార్లు గూగుల్​ ఇచ్చే సమాధానాలు నవ్వు తెప్పిస్తుంటాయి. మరికొన్ని సార్లు మాత్రం తీవ్ర వివాదాస్పదం అవుతుంటాయి. తాజాగా ప్రపంచంలో చాలా చండాలమైన భాష ఏది? అని గూగుల్​ను అడిగితే వెంటనే […]

కన్నడిగులకు సారీ చెప్పిన గూగుల్​.. విషయం ఏమిటంటే?
X

ప్రస్తుతం ఏ సమాచారం కావాలన్నా గూగుల్​లో వెదకడం అందరికీ అలవాటుగా మారిపోయింది. ఇంటర్నెట్ వినియోగం పెరిగిపోయాక ప్రతి అంశాన్ని గూగుల్​లో చూస్తున్నాం. ఇదిలా ఉంటే గూగుల్​ అప్పడప్పుడూ మనకు తప్పుడు సమాచారాలు ఇస్తూ ఉంటుంది. అందుకు గూగుల్​లో ప్రత్యేక అల్గారిథమ్స్​ కారణం కావచ్చు.

కొన్ని కొన్ని సార్లు గూగుల్​ ఇచ్చే సమాధానాలు నవ్వు తెప్పిస్తుంటాయి. మరికొన్ని సార్లు మాత్రం తీవ్ర వివాదాస్పదం అవుతుంటాయి. తాజాగా ప్రపంచంలో చాలా చండాలమైన భాష ఏది? అని గూగుల్​ను అడిగితే వెంటనే కన్నడ అని చూపిస్తున్నది.

ఈ విషయం వివాదాస్పదం అయ్యింది. కన్నడ మాట్లాడే వారికి కోపం తెప్పించింది. కన్నడిగుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 మిలియన్ల మంది కన్నడ మాట్లాడుతున్నారు. వారంతా గూగుల్​పై మండిపడుతున్నారు. ఈ విషయం వివాదాస్పదం కావడంతో గూగుల్​ స్పందించింది.

ఇందులో తమ తప్పు ఏమీ లేదని.. తాము ఉద్దేశపూర్వకంగా అలా చేయలేదని చెప్పుకొచ్చింది. కొన్ని సాంకేతిక కారణాలతో ఇలా జరిగి ఉండొచ్చని సర్దిచెప్పే ప్రయత్నం చేసింది. మరోవైపు ఇటువంటి తప్పు మరోసారి జరగకుండా చూస్తామని హామీ ఇచ్చింది గూగుల్​.

‘అగ్లియెస్ట్​’ లాంగ్వేజ్​ ఏదీ అని గూగుల్​లో సెర్చ్​ చేసినప్పుడు కన్నడ అని చూపిస్తుంది. అయితే సెర్చ్​ ఇంజెన్ లలో ఏర్పడే సాంకేతిక సమస్యల వల్ల ఇటువంటి సమస్యలు తలెత్తుతాయని గూగుల్ చెప్పింది.

First Published:  4 Jun 2021 12:48 PM IST
Next Story