Telugu Global
NEWS

టీఆర్​ఎస్​కు ఈటల రాజీనామా

అందరూ ఊహించనట్టుగానే మాజీ మంత్రి ఈటల రాజేందర్​ టీఆర్​ఎస్​ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. గత కొంతకాలంగా ఈటల వ్యవహారం హాట్​ టాపిక్​గా మారిన విషయం తెలిసిందే. ఈటల మీద అవినీతి ఆరోపణలు రావడం.. ఆ తర్వాత సీఎం కేసీఆర్​ ఆయనను మంత్రి వర్గం నుంచి తప్పించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈటల రాజేందర్​ రాజీనామా చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఇటీవల ఈటల రాజేందర్​ ఢిల్లీ వెళ్లి బీజేపీ ముఖ్య నేతలను కలిశారు. […]

టీఆర్​ఎస్​కు ఈటల రాజీనామా
X

అందరూ ఊహించనట్టుగానే మాజీ మంత్రి ఈటల రాజేందర్​ టీఆర్​ఎస్​ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. గత కొంతకాలంగా ఈటల వ్యవహారం హాట్​ టాపిక్​గా మారిన విషయం తెలిసిందే. ఈటల మీద అవినీతి ఆరోపణలు రావడం.. ఆ తర్వాత సీఎం కేసీఆర్​ ఆయనను మంత్రి వర్గం నుంచి తప్పించిన విషయం తెలిసిందే.

అప్పటి నుంచి ఈటల రాజేందర్​ రాజీనామా చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఇటీవల ఈటల రాజేందర్​ ఢిల్లీ వెళ్లి బీజేపీ ముఖ్య నేతలను కలిశారు. దీంతో ఈటల టీఆర్​ఎస్​కు రాజీనామా చేయడం ఖాయమని తేలిపోయింది. ఇవాళ .. శామీర్​పేటలోని స్వగృహంలో ఈటల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్​పై పలు ఆరోపణలు చేశారు.

‘ ప్రగతి భవన్​ కాదు.. దాని పేరు బానిస భవన్​ అని పెట్టుకోవాలి. నాకు సీఎం కేసీఆర్​కు గ్యాప్​ ఇవాళ రాలేదు. ఐదేళ్ల క్రితమే వచ్చింది. నన్ను కనీసం ప్రగతి భవన్​లోకి రానివ్వలేదు. ఎన్నో విధాలుగా అవమానించారు. నేను కాదు చాలా మంది మంత్రులు అవమానాలు ఎదుర్కొన్నారు. మంత్రి హరీశ్​ కూడా ఎన్నో అవమానాలు భరించారు. పార్టీ కోసం అవమానాలు భరిస్తూ వచ్చాను. కొన్ని ప్రభుత్వ నిర్ణయాలను నేను తప్పుపట్టాను నిజమే. ఇన్​కంట్యాక్స్​ కట్టేవాళ్లకు రైతు బంధు అవసరమా? అని నేను ప్రశ్నించాను. అది కూడా తప్పేనా.

నక్సలైట్​ ఎజెండాయే మా ఎజెండా అని కేసీఆర్​ ఎన్నోసార్లు ప్రకటించారు. మరి విప్లవకవి వరవరరావును పోలీసులు అరెస్ట్​ చేస్తే.. కనీసం ఖండించలేదు. ఓ అనామకుడు ఫిర్యాదు చేశాడని నా మీద విచారణకు ఆదేశించారు. కనీసం నా వివరణ కూడా తీసుకోకుండా నన్ను మంత్రివర్గం నుంచి తొలగించారు.

ఉరిశిక్ష పడ్డ ఖైదీకి కూడా చివరి సారి మాట్లాడే అవకాశం ఉంటుంది. నాకు ఆ అవకాశం కూడా లేదా? నన్ను బతికుండగానే బొందపెడదామని చూశారు.హుజురాబాద్​ నియోజకవర్గంలోని నా అనుచరులను దూరం చేశారు. అయినప్పటికీ ప్రజలు నా వెంటే ఉన్నారు.

కేసీఆర్​ బీఫామ్​ ఇచ్చినంత మాత్రాన ఎవరూ గెలవరు? తన సొంతకూతురుకు కేసీఆర్​ బీఫాం ఇచ్చి నిజామాబాద్​లో నిలబెట్టారు. ఆమె ఓడిపోయింది కదా? సీఎంవో లో దళిత, బహుజన వర్గాలకు చెందిన అధికారి ఒక్కరైనా ఉన్నారా? ’ అంటూ ఈటల రాజేందర్​ ప్రభుత్వంపై ఫైర్​ అయ్యారు. త్వరలోనే ఆయన బీజేపీలో చేరబోతున్నట్టు సమాచారం.

First Published:  4 Jun 2021 6:30 AM IST
Next Story