Telugu Global
National

చిన్నారులను ఎలా కాపాడుకోవాలంటే..

కరోనా ఎఫెక్ట్ పిల్లలపై పడుతోంది. పిల్లలు వైరస్ తో ఇబ్బంది పడకున్నా.. తల్లిదండ్రుల్ని కోల్పోయి దయనీయమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చైల్డ్‌ రైట్స్‌ రిపోర్ట్స్ ప్రకారం తల్లిదండ్రుల్లో ఎవరో ఒకర్ని కోల్పోయిన చిన్నారుల సంఖ్య 9,346 గా ఉంటే ఇందులో తల్లిదండ్రులిద్దర్నీ కోల్పోయినవారు 1,700 మంది ఉన్నారు. ప్రస్తుతం తల్లిదండ్రుల్ని కోల్పొతున్న పిల్లల సంరక్షణపై కేంద్రం దృష్టిసారించింది. కరోనా వల్ల ప్రభావితమైన చిన్నారుల సంరక్షణ బాధ్యతలను చేపట్టాలని, దానికోసం అన్ని రాష్ట్రాలు, […]

చిన్నారులను ఎలా కాపాడుకోవాలంటే..
X

కరోనా ఎఫెక్ట్ పిల్లలపై పడుతోంది. పిల్లలు వైరస్ తో ఇబ్బంది పడకున్నా.. తల్లిదండ్రుల్ని కోల్పోయి దయనీయమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చైల్డ్‌ రైట్స్‌ రిపోర్ట్స్ ప్రకారం తల్లిదండ్రుల్లో ఎవరో ఒకర్ని కోల్పోయిన చిన్నారుల సంఖ్య 9,346 గా ఉంటే ఇందులో తల్లిదండ్రులిద్దర్నీ కోల్పోయినవారు 1,700 మంది ఉన్నారు.

ప్రస్తుతం తల్లిదండ్రుల్ని కోల్పొతున్న పిల్లల సంరక్షణపై కేంద్రం దృష్టిసారించింది. కరోనా వల్ల ప్రభావితమైన చిన్నారుల సంరక్షణ బాధ్యతలను చేపట్టాలని, దానికోసం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కొన్ని మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది.

కరోనాతో ప్రభావితమైన పిల్లల సంరక్షణ బాధ్యతను ఆయా జిల్లా కలెక్టర్లు తీసుకోవాలి. జువెనైల్‌ జస్టిస్‌ యాక్ట్‌-2015 ప్రకారం, అలాంటి చిన్నారులకు వసతి కల్పించేలా కలెక్టర్లు ఏర్పాట్లు చేయాలి.

తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు వంశపారపర్యంగా వచ్చే ఆస్తులపై హక్కును రక్షించే బాధ్యతను జిల్లా కలెక్టర్లే తీసుకోవాలి. ఆ ఆస్తులను అమ్మడం లేదా ఆక్రమణకు గురికాకుండా కాపాడాలి.

అనాథలుగా మారిన పిల్లలు అక్రమ రవాణాకు గురికాకుండా అలాగే బాల కార్మికులుగా మారకుండా పోలీస్‌ విభాగం అప్రమత్తంగా ఉండాలి.

తల్లిదండ్రులను కోల్పోయి కుంగుబాటుకు గురైన పిల్లలను గుర్తించి, వారి వివరాలను ‘ట్రాక్‌ చైల్డ్‌’ పోర్టల్‌లో నమోదు చేయాలి. తల్లిదండ్రులకు కరోనా సోకి అనారోగ్యంపాలైతే.. వారి చిన్నారులు ఉండేందుకు తాత్కాలికంగా పిల్లల సంరక్షణ కేంద్రాలను (సీసీఐలు) ఏర్పాటు చేయాలి. అలాగే కోవిడ్‌తో బాధపడుతున్న పిల్లలకు కూడా సీసీఐల్లోనే ప్రత్యేక ఐసోలేషన్‌ సదుపాయాల్ని ఏర్పాటు చేయాలి.

అలాగే ఇలాంటి చిన్నారులు చదవుకోడానికి ప్రభుత్వ లేదా రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో ఉచిత విద్య అందేలా చర్యలు తీసుకోవాలి. ఒకవేళ పిల్లలు ప్రైవేటు స్కూల్‌లో చదువుతుంటే విద్యాహక్కు చట్టం కింద వారి ఫీజుల భారాన్ని తగ్గించేందుకు.. కేంద్ర, రాష్ట్ర‌ ప్రభుత్వ స్కాలర్‌షిప్‌ పథకాలైనా అమలు చేయాలి.

First Published:  4 Jun 2021 11:55 AM IST
Next Story