వైఎస్ షర్మిల పార్టీ 'వైఎస్సార్ తెలంగాణ పార్టీ'
వైఎస్ షర్మిల తెలంగాణలో ఓ రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె పార్టీకి ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు దక్కింది. వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్ టీపీ)కి ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఆ పార్టీకి షర్మిల ప్రధాన అనుచరుడు వాడుక రాజగోపాల్ చైర్మన్‌గా వ్యవహరించబోతున్నారు. జూలై 8న అధికారికంగా పార్టీని ప్రారంభించనున్నట్టు సమాచారం. త్వరలోనే పార్టీ పూర్తిస్థాయిలో కార్యవర్గాన్ని నియమించబోతున్నట్టు సమాచారం. షర్మిల ఇప్పటికే తెలంగాణలో రాజకీయ కార్యకలాపాలను ప్రారంభించారు. పార్టీ […]
వైఎస్ షర్మిల తెలంగాణలో ఓ రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె పార్టీకి ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు దక్కింది. వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్ టీపీ)కి ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఆ పార్టీకి షర్మిల ప్రధాన అనుచరుడు వాడుక రాజగోపాల్ చైర్మన్‌గా వ్యవహరించబోతున్నారు.
జూలై 8న అధికారికంగా పార్టీని ప్రారంభించనున్నట్టు సమాచారం. త్వరలోనే పార్టీ పూర్తిస్థాయిలో కార్యవర్గాన్ని నియమించబోతున్నట్టు సమాచారం. షర్మిల ఇప్పటికే తెలంగాణలో రాజకీయ కార్యకలాపాలను ప్రారంభించారు. పార్టీ పెట్టబోతున్నట్టు కూడా ప్రకటించారు. ఖమ్మంలో భారీ బహిరంగ సభను నిర్వహించారు.
ఆ తర్వాత ఇందిరాపార్కులో ఉద్యోగాల కోసం దీక్ష చేపట్టారు. అయితే షర్మిల రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించిన వెంబడే కరోనా తీవ్ర రూపం దాల్చిన విషయం తెలిసిందే. దీంతో ఆమె కొంతకాలం సైలెంట్ అయ్యారు.
ఇటీవల మళ్లీ కేసుల సంఖ్య తగ్గడంతో షర్మిల యాక్టివ్ అయ్యారు. తెలంగాణలో ప్రధానంగా నిరుద్యో సమస్యపైనే ఆమె పోరాటం సాగిస్తున్నారు. ఉద్యోగాలు రాక ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలను కూడా షర్మిల పరామర్శించారు. ఆమె బుధవారం మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం శేరిల్లా గ్రామానికి వెళ్లి.. నిరుద్యోగంతో ఆత్మహత్య చేసుకున్న వెంకటేశ్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. ఏ లక్ష్యాల కోసమైతే తెలంగాణ ఏర్పడిందో? ఆ లక్ష్యాలు నెరవేరడం లేదని ఆమె విమర్శించారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళి అర్పించారు.
పాదయాత్రతో ప్రజల్లోకి..!
తెలంగాణ ప్రజలకు చేరువయ్యేందుకు వైఎస్ షర్మిల పాదయాత్రను ఎంచుకోబోతున్నట్టు సమాచారం. జూలై 21 నుంచి ఆమె తెలంగాణలో పాదయాత్ర చేయబోతున్నట్టు సమాచారం. తెలంగాణ వ్యాప్తంగా తిరిగి వివిధ వర్గాల ప్రజలను ఆమె కలుసుకోబోతున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు తెలంగాణ ప్రభుత్వంపై కూడా ఆమె రాజీలేని పోరాటం చేయబోతున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే దళిత, రెడ్డి సామాజివర్గం నుంచి తనకు మద్దతు దక్కే అవకాశం ఉందని షర్మిల, ఆమె అనుచరులు భావిస్తున్నారు. మిగిలిన వర్గాలకు కూడా దగ్గరయ్యేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే తెలంగాణలో కులరాజకీయాలు తక్కువగానే ఉంటాయి. అయితే షర్మిల ను ఎదుర్కొనేందుకు టీఆర్ఎస్ ఎటువంటి వ్యూహాలు రచిస్తుందో వేచి చూడాలి.