పుష్ప సినిమాలో మాజీ లవర్ బాయ్?
పుష్పపై పుకార్లు కొత్త కాదు. రోజుకో పుకారు షికారు చేయకపోతే అదో వింత. ఈసారి కూడా పుష్పపై మరో పుకారు గుప్పుమంది. అయితే ఈసారి వినిపిస్తున్న పుకారు మాత్రం చాలా కొత్తగా ఉంది. అదేంటంటే.. ఈ సినిమాలో హీరో తరుణ్ నటించబోతున్నాడట. ఒకప్పుడు లవర్ బాయ్ గా తిరుగులేని ఇమేజ్ తెచ్చుకున్నాడు తరుణ్. ఆ తర్వాత వరుస ఫ్లాపులు చూసి, ప్రస్తుతం ఫేడవుట్ అయిపోయాడు. ఇలాంటి టైమ్ లో తరుణ్ ను పిలిచిమరీ అవకాశం ఇచ్చాడట దర్శకుడు […]
పుష్పపై పుకార్లు కొత్త కాదు. రోజుకో పుకారు షికారు చేయకపోతే అదో వింత. ఈసారి కూడా పుష్పపై మరో
పుకారు గుప్పుమంది. అయితే ఈసారి వినిపిస్తున్న పుకారు మాత్రం చాలా కొత్తగా ఉంది. అదేంటంటే.. ఈ
సినిమాలో హీరో తరుణ్ నటించబోతున్నాడట.
ఒకప్పుడు లవర్ బాయ్ గా తిరుగులేని ఇమేజ్ తెచ్చుకున్నాడు తరుణ్. ఆ తర్వాత వరుస ఫ్లాపులు చూసి,
ప్రస్తుతం ఫేడవుట్ అయిపోయాడు. ఇలాంటి టైమ్ లో తరుణ్ ను పిలిచిమరీ అవకాశం ఇచ్చాడట
దర్శకుడు సుకుమార్. ఈ మేటర్ లో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
గమ్మత్తైన విషయం ఏంటంటే.. పుష్పకు సంబంధించి ఇప్పటివరకు బయటకొచ్చిన పుకార్లన్నీ నిజం
అవుతున్నాయి. మొన్నటికి మొన్న ఈ సినిమాలో ఐటెంసాంగ్ కోసం దిశా పటానీని తీసుకున్నారంటూ
పుకారు రావడం, ఆ వెంటనే అది నిజం అవ్వడం చకచకా జరిగిపోయాయి. ఈ క్రమంలో తరుణ్ పుకారు
రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.