Telugu Global
NEWS

తెలంగాణ సర్కారుకు హైకోర్టు మొట్టికాయలు..

కొవిడ్ పై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాల విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి మరోసారి మొట్టికాయలు వేసింది. ప్రైవేటు ఆస్పత్రుల అడ్డగోలు ఫీజులను క్రమబద్ధీకరించేందుకు జీవో విడుదల చేయాలని గతంలో తామిచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 48గంటల్లోగా జీవో ఇవ్వాలని మే 17న తాము ఉత్తర్వులిస్తే.. ఇప్పటి వరకూ నిర్లక్ష్యంగా ఉన్నారెందుకని ప్రశ్నించింది. ఈనెల 10న దీనికి సంబంధించిన జీవో తమ ముందు ఉంచాలని ఆదేశిస్తూ కేసు విచారణ వాయిదా […]

తెలంగాణ సర్కారుకు హైకోర్టు మొట్టికాయలు..
X

కొవిడ్ పై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాల విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి మరోసారి మొట్టికాయలు వేసింది. ప్రైవేటు ఆస్పత్రుల అడ్డగోలు ఫీజులను క్రమబద్ధీకరించేందుకు జీవో విడుదల చేయాలని గతంలో తామిచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 48గంటల్లోగా జీవో ఇవ్వాలని మే 17న తాము ఉత్తర్వులిస్తే.. ఇప్పటి వరకూ నిర్లక్ష్యంగా ఉన్నారెందుకని ప్రశ్నించింది. ఈనెల 10న దీనికి సంబంధించిన జీవో తమ ముందు ఉంచాలని ఆదేశిస్తూ కేసు విచారణ వాయిదా వేసింది.

ప్రైవేటు ఆస్పత్రులపై వేటు వేస్తే సరిపోదని, వారు అన్యాయంగా వసూలు చేసిన సొమ్ము తిరిగి బాధితులకు ఇప్పించాలని సూచించింది హైకోర్టు. ఫీజుల విషయంలో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన ఆస్పత్రుల వ్యవస్థాపకులపై ఏపీలో క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తున్నారని, కేరళలో వారు వసూలు చేసిన సొమ్ముపై రెట్టింపు జరిమానా విధిస్తున్నారని, అలాంటి అంశాలనూ పరిశీలించాలని తెలంగాణ ప్రభుత్వానికి కోర్టు సూచించింది. కొవిడ్‌ ట్రీట్‌మెంట్‌, మందులు, పరీక్షలు, పీపీఈ కిట్‌ లు మొదలైన వాటికి ముందు ధరలు నిర్ణయించాలని, ఆ తర్వాత ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని చెప్పింది. ప్రభుత్వ ఉదాసీనతను తీవ్రంగా తప్పుబట్టింది.

ప్రశ్నల వర్షం..
కేసు విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి పలు ప్రశలు సంధించింది హైకోర్టు..
– ఎన్నికల విధుల్లో పాల్గొని కొవిడ్ బారిన పడ్డ 15మందికి సరైన వైద్య సదుపాయాలు అందించారా, వారి కుటుంబాలకు ఆర్థిక బాసట కల్పించారా..?
– లాక్‌డౌన్‌ సమయంలో స్వచ్ఛంద సంస్థలతో కలిసి అవసరమైన వారికి ఉచిత భోజనం ఏర్పాట్లు చేశారా..?
– అనాథలు, యాచకులు, సంచార జాతులవారు, జైళ్లు, మానసిక వైద్యశాలలు, వృద్ధాశ్రమాలు, పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి వ్యాక్సినేషన్ ప్రణాళిక ఏంటి..?
– 14 ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌ ల ఏర్పాటు, సలహా కమిటీ ఏర్పాటు, వలస కార్మికుల తరలింపు, కొవిడ్ కేంద్రాల ఏర్పాటు, శ్మశానవాటికల్లో కొవిడ్‌ మృతుల సంఖ్య వెల్లడించడంపై తీసుకున్న చర్యలేంటి..?
వీటన్నిటికీ ఈనెల 10న లిఖిత పూర్వక సమాధానం చెప్పాలని ఆదేశించింది హైకోర్టు.

First Published:  3 Jun 2021 3:02 AM IST
Next Story