Telugu Global
Cinema & Entertainment

బాలయ్య సినిమా ప్రకటన వస్తుందా?

సరిగ్గా మరో వారం రోజుల్లో బాలయ్య పుట్టినరోజు వస్తోంది. పుట్టినరోజు అంటే కచ్చితంగా సినిమా ప్రకటన ఉండాల్సిందే. మరి ఈసారి బాలయ్య నుంచి ఎలాంటి ప్రకటన రాబోతోంది. ఎందుకంటే, ఆయన చేతిలో 3 సినిమాలున్నాయి మరి. ప్రస్తుతం అఖండ సినిమా చేస్తున్నాడు బాలయ్య. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే టీజర్, ఫస్ట్ లుక్ రిలీజైంది. పుట్టినరోజుకు కచ్చితంగా మరో బ్రాండ్ న్యూ పోస్టర్ వస్తుంది. అఖండ కాకుండా బాలయ్య చేతిలో రెండు సినిమాలున్నాయి. […]

బాలయ్య సినిమా ప్రకటన వస్తుందా?
X

సరిగ్గా మరో వారం రోజుల్లో బాలయ్య పుట్టినరోజు వస్తోంది. పుట్టినరోజు అంటే కచ్చితంగా సినిమా ప్రకటన
ఉండాల్సిందే. మరి ఈసారి బాలయ్య నుంచి ఎలాంటి ప్రకటన రాబోతోంది. ఎందుకంటే, ఆయన చేతిలో
3 సినిమాలున్నాయి మరి.

ప్రస్తుతం అఖండ సినిమా చేస్తున్నాడు బాలయ్య. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు
సంబంధించి ఇప్పటికే టీజర్, ఫస్ట్ లుక్ రిలీజైంది. పుట్టినరోజుకు కచ్చితంగా మరో బ్రాండ్ న్యూ పోస్టర్
వస్తుంది.

అఖండ కాకుండా బాలయ్య చేతిలో రెండు సినిమాలున్నాయి. వీటిలో ఒకటి గోపీచంద్ మలినేని
దర్శకత్వంలో చేయాల్సిన సినిమా. రెండోది అనీల్ రావిపూడి సినిమా. ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా
ప్రకటన ఆ రోజున వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

First Published:  3 Jun 2021 2:22 PM IST
Next Story