Telugu Global
NEWS

ఏపీలో 50 వేల కోట్లతో 28 లక్షల పక్కాఇళ్లు..!

ఆంధ్రప్రదేశ్​లో ప్రతి నిరుపేదకు సొంత ఇంటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఏపీ సీఎం జగన్​ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా 2023 జూన్​ నాటికి రూ. 50,994 కోట్లతో 28,30,227 ఇళ్లను నిర్మించబోతున్నామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ప్రభుత్వం 30.76 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన రికార్డు సృష్టించిన ప్రభుత్వం.. తాజాగా ఇప్పుడు కేవలం రెండు విడతల్లోనే వీరందరికీ పక్కా ఇళ్లు నిర్మించేందుకు పూనుకుంది. ఈ […]

ఏపీలో 50 వేల కోట్లతో 28 లక్షల పక్కాఇళ్లు..!
X

ఆంధ్రప్రదేశ్​లో ప్రతి నిరుపేదకు సొంత ఇంటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఏపీ సీఎం జగన్​ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా 2023 జూన్​ నాటికి రూ. 50,994 కోట్లతో 28,30,227 ఇళ్లను నిర్మించబోతున్నామని ఆయన పేర్కొన్నారు.
ఇప్పటికే ప్రభుత్వం 30.76 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన రికార్డు సృష్టించిన ప్రభుత్వం.. తాజాగా ఇప్పుడు కేవలం రెండు విడతల్లోనే వీరందరికీ పక్కా ఇళ్లు నిర్మించేందుకు పూనుకుంది.

ఈ నిర్మాణాలను రెండు దశల్లో చేపడతామని సీఎం చెప్పారు. గురువారం ఆయన తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్​ విధానంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్​ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 17 వేల వైఎస్సార్​ జగనన్న కాలనీలు రాబోతున్నాయని స్పష్టం చేశారు. మొత్తం 8,900 లే అవుట్లలో 11 లక్షల 26 వేల ఇళ్ల నిర్మాణాలను ఇవాళ శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.
మూడు విభాగాలుగా ప్రభుత్వం గృహ నిర్మాణ పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే.

సొంతంగా కట్టుకునే స్తోమత లేనివారికి ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇస్తుంది. సొంత ఇళ్ల స్థలాలు ఉండి, ఇళ్లు కట్టుకొనే లబ్ధిదారులకు నిర్మాణ సామగ్రి కొనుగోలు, కూలీల ఖర్చు కింద ప్రభుత్వం తన వాటా భరిస్తుంది. ఇలాంటి వారు మరో 4.33 లక్షల మంది ఉన్నారు.

జగనన్న కాలనీల్లో ఒకే రకమైన నమునాతో ప్రతి ఇంటిని 340 చదరపు అడుగుల పరిధిలో నిర్మించనున్నది. ప్రతి ఇంటికి రెండు ఫ్యాన్లు , రెండు ట్యూబ్​లైట్లు, నాలుగు బల్బులు, ఒక సింటెక్స్​ ట్యాంకును అందించనున్నది.

ఈ సమావేశంలో సీఎం జగన్​ మాట్లాడుతూ.. ప్రతి నలుగురిలో ఒకరికి పక్కా ఇంటితో పాటు ఇంటి స్థలం అందజేస్తున్నట్టు చెప్పారు. ప్రతి ఇంటికి 20 టన్నుల ఇసుకను ఉచితంగా అందిస్తున్నామన్నారు.
ఇళ్ల నిర్మాణం పూర్తయితే సదుపాయాల రూపంలో ప్రతి ఇంటికి రూ.లక్షన్నర ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. ఇంటి నిర్మాణం కోసం రూ.1.8 లక్షలు ఇస్తున్నామని చెప్పారు.

దాదాపు రూ.7 లక్షల విలువైన ఇంటి స్థలం ఇచ్చామని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రకుల్లాలోని పేదవారికి కాలనీలు పూర్తయ్యేసరికి.. రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఆస్తి సమకూరుతుందన్నారు. అర్హత ఉండి లబ్ధిదారుల జాబితాలో లేనివాళ్లు మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

First Published:  3 Jun 2021 2:43 AM GMT
Next Story