ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా రద్దు?
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు రద్దు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు కేంద్ర ప్రభుత్వం సైతం సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పరీక్షలు రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో ఈ పరీక్షలు నిర్వహించడం భావ్యం కాదని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలో రాష్ట్రంలోనూ ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేయాలని ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. నిజానికి మే మొదటి వారంలోనే ఇంటర్మీడియట్ […]
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు రద్దు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు కేంద్ర ప్రభుత్వం సైతం సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పరీక్షలు రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నది.
ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో ఈ పరీక్షలు నిర్వహించడం భావ్యం కాదని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలో రాష్ట్రంలోనూ ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేయాలని ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. నిజానికి మే మొదటి వారంలోనే ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే కరోనా ఎఫెక్ట్ తో పరీక్షలను వాయిదా వేశారు. జూలై రెండో వారంలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల పరీక్షల నిర్వహణ సరికాదని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.
ఓ వైపు దేశంలో కరోనా మూడో వేవ్ వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మరోవైపు మూడో వేవ్‌లో ఎక్కువగా పిల్లలు కరోనా బారిన పడే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. అందుకు కారణం.. ప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. వయోవృద్ధులు, మధ్యవయస్సు వారిలో కొంతమంది, ఫ్రంట్ లైన్ వారియర్స్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. సూపర్ స్పైడర్స్ జాబితాలో మరికొందరికి వ్యాక్సినేషన్ అందుతోంది.
ఈ క్రమంలో మూడో వేవ్‌లో ఎక్కువగా పిల్లల మీద ప్రభావం ఉంటుందని సైంటిస్టులు అంటున్నారు.ఈ నేపథ్యంలో పరీక్షలు నిర్వహించవద్దని కేంద్రం భావించనట్టు సమాచారం. గతంలో స్కూల్స్ తెరిచాక కరోనా కేసులు పెరిగాయి.
తెలంగాణలో పరిస్థితి ఏమిటి?
రాష్ట్రంలో కరోనా కేసులు కొంతమేర తగ్గుముఖం పట్టాయి. అయినప్పటికీ లాక్డౌన్ అమల్లోనే ఉంది. ఈ పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహిస్తే .. మళ్లీ పరిస్థితి అదుపుతప్పే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 4,73,967 మంది విద్యార్థులు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాయాల్సి ఉంది. కోవిడ్ నేపథ్యంలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను బోర్డు ఇప్పటికే రద్దు చేసింది.
మార్కులు ఎలా నిర్ణయిస్తారు?
ఒకవేళ ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేస్తే విద్యార్థులకు మార్కులు ఎలా వేయాలి అనే విషయంపై అధికారులు చర్చిస్తున్నట్టు సమాచారం. గత ఏడాది నిర్వహించిన ఫస్టియర్ పరీక్షల ఆధారంగానే ఈ సారి మార్కులు వేయాలని విషయంపై అధికారులు చర్చిస్తున్నారు. పరీక్షలకు గైర్హాజరైన వారికి 45 శాతం మార్కులు వేసే అవకాశం ఉంది. అయితే ప్రాక్టికల్స్ నిర్వహించకుండా.. రికార్డ్స్ ఆధారంగా ఆ మార్కులు వేయబోతున్నట్టు సమాచారం.