మహేష్-రాజమౌళి మూవీపై క్లారిటీ
మహేష్-రాజమౌళి సినిమాపై ఇప్పటివరకు వచ్చిన వార్తలన్నీ పుకార్లే. వీటికి ఎలాంటి ఆధారాల్లేవు. అయితే ఊహించని విధంగా ఈ కాంబినేషన్ పై ఓ క్లారిటీ వచ్చింది. స్వయంగా నిర్మాత కేఎల్ నారయణ, ఈ సినిమాపై వచ్చిన పుకార్లపై స్పందించారు. మహేష్-రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న సినిమాను అటవీ నేపథ్యంలో తీయబోతున్నారంటూ ఆ మధ్య ఊహాగానాలొచ్చాయి. వీటని కొట్టిపారేస్తున్నారు నిర్మాత నారాయణ. అసలు మహేష్-రాజమౌళి సినిమాకు ఇప్పటివరకు ఎలాంటి కథ లేదా స్టోరీలైన్ ను లాక్ చేయలేదని స్పష్టంచేశారు. అటు […]
మహేష్-రాజమౌళి సినిమాపై ఇప్పటివరకు వచ్చిన వార్తలన్నీ పుకార్లే. వీటికి ఎలాంటి ఆధారాల్లేవు.
అయితే ఊహించని విధంగా ఈ కాంబినేషన్ పై ఓ క్లారిటీ వచ్చింది. స్వయంగా నిర్మాత కేఎల్ నారయణ,
ఈ సినిమాపై వచ్చిన పుకార్లపై స్పందించారు.
మహేష్-రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న సినిమాను అటవీ నేపథ్యంలో తీయబోతున్నారంటూ ఆ
మధ్య ఊహాగానాలొచ్చాయి. వీటని కొట్టిపారేస్తున్నారు నిర్మాత నారాయణ. అసలు మహేష్-రాజమౌళి
సినిమాకు ఇప్పటివరకు ఎలాంటి కథ లేదా స్టోరీలైన్ ను లాక్ చేయలేదని స్పష్టంచేశారు.
అటు సినీ రచయిత విజయేంద్రప్రసాద్ కూడా తాజాగా ఈ విషయాన్ని నిర్థారించారు. మహేష్-రాజమౌళి
సినిమా కథపై తను వర్క్ చేస్తున్న మాట నిజమేనని అంగీకరించిన విజయేంద్రప్రసాద్, ఇప్పటివరకు
ఎలాంటి స్టోరీలైన్ లాక్ చేయలేదని స్పష్టంచేశారు.
ఇలా ఒకేసారి యూనిట్ లోని ఇద్దరు కీలక వ్యక్తుల నుంచి ఈ ప్రాజెక్టుకు సంబందించి స్పష్టత రావడంతో..
పుకార్లు ఆగిపోయాయి. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో రాజమౌళి.. సర్కారువారి పాట సినిమాతో మహేష్
బిజీగా ఉన్నారు.