హీరో అజిత్ కు బాంబు బెదిరింపు
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కు బాంబు బెదిరింపులు వచ్చాయి. అజిత్ ఇంట్లో బాంబు పెట్టానంటూ ఓ అగంతకుడు తమిళనాడు పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేశాడు. దీంతో హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు.. అజిత్ ఇల్లు మొత్తం గాలించారు. ఎలాంటి బాంబు లేదని నిర్థారించుకున్నారు. అయితే ఈ విషయాన్ని పోలీసులు ఇక్కడితో వదిలేయలేదు. బాంబు బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి ఎవరో ఆరా తీశారు. ఫోన్ కాల్ ఆధారంగా ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. చెన్నైలోని […]
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కు బాంబు బెదిరింపులు వచ్చాయి. అజిత్ ఇంట్లో బాంబు పెట్టానంటూ ఓ
అగంతకుడు తమిళనాడు పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేశాడు. దీంతో హుటాహుటిన రంగంలోకి దిగిన
పోలీసులు.. అజిత్ ఇల్లు మొత్తం గాలించారు. ఎలాంటి బాంబు లేదని నిర్థారించుకున్నారు.
అయితే ఈ విషయాన్ని పోలీసులు ఇక్కడితో వదిలేయలేదు. బాంబు బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి
ఎవరో ఆరా తీశారు. ఫోన్ కాల్ ఆధారంగా ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. చెన్నైలోని మరక్కన్నమ్
లో ఉండే దినేష్ అనే వ్యక్తి ఈ చర్యలకు పాల్పడినట్టు గుర్తించి, అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.
ఇదే వ్యక్తి గతంలో రజనీకాంత్ ఇంట్లో బాంబు పెట్టినట్టు పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి బెదిరించాడు.
విచారణ జరిపిన తర్వాత దినేష్ కు మతిస్థిమితం లేదని పోలీసులు నిర్థారించారు. గతంలో భువనేష్ అనే
వ్యక్తి కూడా ఇలానే పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి అజిత్ ఇంట్లో బాంబ్ పెట్టినట్టు బెదిరించాడు.
అది కూడా ఫేక్ అని తేలింది అప్పట్లో.