జీ గ్రూప్ చేతికి మరో పెద్ద సినిమా?
ఇప్పటికే ఆర్ఆర్ఆర్ మూవీ రైట్స్ దక్కించుకుంది జీ గ్రూప్ సంస్థ. ఈ సినిమాకు సంబంధించిన అన్ని దక్షిణాది భాషల డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ఈ సంస్థకు చెందాయి. దీంతో పాటు హిందీ శాటిలైట్ రైట్స్ కూడా దక్కించుకుంది. ఇప్పుడిదే గ్రూప్ మరో పెద్ద సినిమాపై కన్నేసింది. కుదిరితే రాధేశ్యామ్ మూవీని దక్కించుకునేలా ఉంది ఈ సంస్థ. ప్రస్తుతం జీ గ్రూప్, రాధేశ్యామ్ నిర్మాతల మధ్య ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్ కు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. […]
ఇప్పటికే ఆర్ఆర్ఆర్ మూవీ రైట్స్ దక్కించుకుంది జీ గ్రూప్ సంస్థ. ఈ సినిమాకు సంబంధించిన అన్ని
దక్షిణాది భాషల డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ఈ సంస్థకు చెందాయి. దీంతో పాటు హిందీ శాటిలైట్ రైట్స్
కూడా దక్కించుకుంది. ఇప్పుడిదే గ్రూప్ మరో పెద్ద సినిమాపై కన్నేసింది. కుదిరితే రాధేశ్యామ్ మూవీని
దక్కించుకునేలా ఉంది ఈ సంస్థ.
ప్రస్తుతం జీ గ్రూప్, రాధేశ్యామ్ నిర్మాతల మధ్య ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్ కు సంబంధించి
చర్చలు జరుగుతున్నాయి. బాహుబలితో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఆ తర్వాత అతడు
నటించిన సాహో సినిమా బాలీవుడ్ లో వంద కోట్లు కలెక్ట్ చేసింది. ఈ నేపథ్యంలో రాధేశ్యామ్ హిందీ
రైట్స్ కు కూడా భారీ డిమాండ్ ఏర్పడింది.
ప్రస్తుతం రంగంలోకి దిగిన జీ గ్రూప్.. రాధేశ్యామ్ సినిమాకు సంబంధించి పూర్తి హక్కులు తీసుకుంటుందా
లేక ఆర్ఆర్ఆర్ టైపులోనే కొన్ని రైట్స్ కే పరిమితమౌతుందా అనేది చూడాలి. రాధాకృష్ణ కుమార్
దర్శకత్వంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు అటుఇటుగా 250 కోట్ల రూపాయలు
ఖర్చయింది.