Telugu Global
NEWS

రేవంత్​రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు..!

ఓటుకు నోటు కేసులో టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్ రేవంత్​రెడ్డికి మరోసారి చుక్కెదురైంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన అవతకవకలపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి కానీ ఏసీబీ ఎందుకు చర్యలు తీసుకుంటుంది? అంటూ చాలా రోజులుగా రేవంత్​ రెడ్డి వాదిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇదే విషయంపై ఆయన తెలంగాణ హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. ఓటుకు నోటు కేసు ఏసీబీ పరిధిలోకి రాదని.. దాన్ని వెంటనే ఎన్నికల సంఘానికి బదిలి చేయాలంటూ ఆయన పిటిషన్​ దాఖలు చేశారు. […]

రేవంత్​రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు..!
X

ఓటుకు నోటు కేసులో టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్ రేవంత్​రెడ్డికి మరోసారి చుక్కెదురైంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన అవతకవకలపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి కానీ ఏసీబీ ఎందుకు చర్యలు తీసుకుంటుంది? అంటూ చాలా రోజులుగా రేవంత్​ రెడ్డి వాదిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇదే విషయంపై ఆయన తెలంగాణ హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు.

ఓటుకు నోటు కేసు ఏసీబీ పరిధిలోకి రాదని.. దాన్ని వెంటనే ఎన్నికల సంఘానికి బదిలి చేయాలంటూ ఆయన పిటిషన్​ దాఖలు చేశారు. అయితే రేవంత్​రెడ్డి పిటిషన్​ను హైకోర్టు తిరస్కరించింది. రేవంత్​రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.

టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్​రెడ్డిని గెలిపించేందుకు రేవంత్​.. ఎమ్మెల్యే స్టీఫెన్​ సన్​కు రూ. 50 లక్షలు లంచం ఇస్తుండగా.. ఏసీబీ అధికారులు రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఈ కేసులో రేవంత్​రెడ్డి ప్రధాన ముద్దాయిగా ఉన్నారు. అయితే ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఫోన్​ సంభాషణలు కూడా సంచలనంగా మారాయి. ఇదిలా ఉంటే ఈ కేసు 2015 నుంచి రేవంత్​రెడ్డిని వెంటాడుతూనే ఉంది. తాజాగా ఈ కేసును ఎన్నికల సంఘానికి బదిలీ చేయాలంటూ రేవంత్​ వేసిన పిటిషన్​ ను సైతం హైకోర్టు కొట్టేయడం గమనార్హం.

First Published:  1 Jun 2021 3:08 PM IST
Next Story