ఖట్టర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కేజ్రీవాల్..!
కరోనా వేళ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఎంతో మంచిపేరు తెచ్చుకున్నారు. పకడ్బందీగా లాక్ డౌన్ అమలు చేసి.. కరోనాను అదుపులోకి తీసుకొచ్చారు. కరోనా సెకండ్‌వేవ్ వచ్చిన తొలినాళ్లలో ఢిల్లీలోనే అత్యధికంగా కేసులు నమోదయ్యేవి. కానీ ప్రస్తుతం చాలా వరకు కేసులు తగ్గిపోయాయి. అందుకు కారణం .. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చూపిన చొరవే. భారీగా టెస్టులు చేయడం.. అవసరమైన వాళ్లకు వైద్యం చేయడం.. ఉచితంగా మందులు పంపిణీ చేయడం వంటి చర్యలతో ఢిల్లీలో ఆయన కరోనాను అదుపు […]
కరోనా వేళ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఎంతో మంచిపేరు తెచ్చుకున్నారు. పకడ్బందీగా లాక్ డౌన్ అమలు చేసి.. కరోనాను అదుపులోకి తీసుకొచ్చారు. కరోనా సెకండ్‌వేవ్ వచ్చిన తొలినాళ్లలో ఢిల్లీలోనే అత్యధికంగా కేసులు నమోదయ్యేవి. కానీ ప్రస్తుతం చాలా వరకు కేసులు తగ్గిపోయాయి. అందుకు కారణం .. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చూపిన చొరవే. భారీగా టెస్టులు చేయడం.. అవసరమైన వాళ్లకు వైద్యం చేయడం.. ఉచితంగా మందులు పంపిణీ చేయడం వంటి చర్యలతో ఢిల్లీలో ఆయన కరోనాను అదుపు చేయగలిగారు.
మిగతా నగరాలతో పోలిస్తే.. ఎక్కువ జనసాంద్రత ఉన్న ఢిల్లీలో తొందరగానే కరోనాను అదుపుచేయగలిగారు. కరోనా కట్టడిలో కేజ్రీవాల్ చేపట్టిన చర్యలకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి.అయితే కేజ్రీవాల్ మాత్రం.. తొలినుంచి కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నారు. కరోనా కట్టడికి తాము ఎంతో కృషి చేస్తున్నా.. కేంద్రం సహకరించడం లేదని, అవరసమైన మేరకు వ్యాక్సిన్లు పంపిణీ చేయడం లేదని ఆయన విమర్శిస్తూ వస్తున్నారు.
టీకా లభ్యత పెరిగేంత వరకు 18-44 ఏళ్ల వారికి వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు కేజ్రీవాల్ సర్కార్ ప్రకటించింది. దీంతో బీజేపీ విమర్శలు గుప్పించింది.
ఈ విషయంపై హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్.. మాట్లాడుతూ.. టీకాల పంపిణీ అంశాన్ని కేజ్రీవాల్ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. మిగతా రాష్ట్రాల కంటే కేంద్రం ఢిల్లీకే ఎక్కువగా టీకాలు పంపిణీ చేస్తోందని ఆయన చెప్పుకొచ్చారు.
‘వ్యాక్సినేషన్ విషయంలో కేజ్రీవాల్ అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారు. వ్యాక్సినేషన్ ఎలా వేయాలో మమ్మల్ని చూసి నేర్చుకోవాలి. రోజుకు 2 లక్షలు టీకాలు ఇస్తే.. మా దగ్గర కూడా వ్యాక్సిన్లు నిండుకుంటాయి. కానీ మేము రోజుకు 50 వేల నుంచి 60 వేల టీకాలు ఇస్తూ.. టీకా పంపిణీని కొనసాగిస్తున్నాం’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఖట్టర్ వ్యాఖ్యలపై అంతా మండిపడుతున్నారు.
వ్యాక్సినేషన్ ఎంత త్వరగా ఇస్తే.. అంత మంచిది అంతేకానీ.. వ్యాక్సిన్ నిల్వలు పెట్టుకొని.. వ్యాక్సినేషన్ ప్రక్రియ సాగుతున్నట్టు బిల్డప్ ఇవ్వడం ఎందుకు అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయంపై కేజ్రీవాల్ కూడా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
’మేము ప్రజల ప్రాణాలను కాపాడాలనుకుంటున్నాం.. టీకాలను కాదు. ఖట్టర్ సాబ్, టీకాలు మాత్రమే ప్రజల ప్రాణాలు కాపాడతాయి. వ్యాక్సినేషన్ ఎంత త్వరగా పూర్తి చేస్తే అన్ని ప్రాణాలు సురక్షితంగా ఉంటాయి. మా లక్ష్యం టీకాలను నిల్వ చేసుకోవడం కాదు.. ప్రాణాలను రక్షించుకోవడం’ అంటూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.