చిరంజీవి సినిమాకు మాస్ టైటిల్
త్వరలోనే లూసిఫర్ రీమేక్ తో సెట్స్ పైకి రాబోతున్నాడు చిరంజీవి. మోహన్ రాజా దర్శకత్వంలో ఈ సినిమా సెట్స్ పైకి వస్తుందని, దర్శకుడి మార్పు అనేది ఉండదని ఈమధ్య క్లారిటీ ఇచ్చింది యూనిట్. ఇప్పుడీ సినిమాకు సంబంధించి మరో పుకారు షికారు చేస్తోంది. చిరంజీవి సినిమాకు కింగ్ మేకర్ అనే టైటిల్ అనుకుంటున్నారట. త్వరలోనే ఈ టైటిల్ ను కొణెదల ప్రొడక్షన్స్ కంపెనీ బ్యానర్ పై రిజిస్టర్ చేస్తారని అంటున్నారు. నిజానికి ఈ సినిమా కథకు ఈ […]
త్వరలోనే లూసిఫర్ రీమేక్ తో సెట్స్ పైకి రాబోతున్నాడు చిరంజీవి. మోహన్ రాజా దర్శకత్వంలో ఈ
సినిమా సెట్స్ పైకి వస్తుందని, దర్శకుడి మార్పు అనేది ఉండదని ఈమధ్య క్లారిటీ ఇచ్చింది యూనిట్.
ఇప్పుడీ సినిమాకు సంబంధించి మరో పుకారు షికారు చేస్తోంది.
చిరంజీవి సినిమాకు కింగ్ మేకర్ అనే టైటిల్ అనుకుంటున్నారట. త్వరలోనే ఈ టైటిల్ ను కొణెదల
ప్రొడక్షన్స్ కంపెనీ బ్యానర్ పై రిజిస్టర్ చేస్తారని అంటున్నారు. నిజానికి ఈ సినిమా కథకు ఈ టైటిల్ పెర్
ఫెక్ట్ గా సరిపోతుంది. కానీ ఇక్కడో చిక్కుంది.
మలయాళంలో ఈ సినిమా పేరు లూసిఫర్. అదే టైటిల్ తెలుగులో కూడా పాపులర్ అయింది. ఇప్పటికీ
దీన్ని చిరంజీవి లూసిఫర్ రీమేక్ గానే జనాలు చూస్తున్నారు. అలాంటప్పుడు అదే టైటిల్ ను కంటిన్యూ
చేస్తే బాగుండేది. ఒక దశలో చిరంజీవి కూడా అదే అభిప్రాయపడ్డారు. కానీ ఇప్పుడెందుకో టైటిల్ మార్పు
కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.