Telugu Global
Cinema & Entertainment

హీరోయిన్ సీక్రెట్ పెళ్లి

హీరోయిన్లు రహస్యంగా పెళ్లి చేసుకోవడం కొత్త కాదు. శ్రియ, కాజల్ లాంటి వాళ్లు ఇలానే పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లికి కనీసం 2 రోజుల ముందైనా ఆ విషయం బయటకొచ్చింది. కానీ హీరోయిన్ ప్రణీత పెళ్లి మాత్రం అత్యంత రహస్యంగా జరిగిపోయింది. ఆమె చెప్పేవరకు మేటర్ బయటకు రాలేదు. అవును.. హీరోయిన్ ప్రణీత నిన్న పెళ్లి చేసుకుంది. బెంగళూరుకు చెందిన బిజినెస్ మేన్ నితిన్ రాజును ఆమె వివాహం చేసుకుంది. నితిన్ కు చెందిన ఫామ్ హౌజ్ […]

హీరోయిన్ సీక్రెట్ పెళ్లి
X

హీరోయిన్లు రహస్యంగా పెళ్లి చేసుకోవడం కొత్త కాదు. శ్రియ, కాజల్ లాంటి వాళ్లు ఇలానే పెళ్లి
చేసుకున్నారు. అయితే పెళ్లికి కనీసం 2 రోజుల ముందైనా ఆ విషయం బయటకొచ్చింది. కానీ హీరోయిన్
ప్రణీత పెళ్లి మాత్రం అత్యంత రహస్యంగా జరిగిపోయింది. ఆమె చెప్పేవరకు మేటర్ బయటకు రాలేదు.

అవును.. హీరోయిన్ ప్రణీత నిన్న పెళ్లి చేసుకుంది. బెంగళూరుకు చెందిన బిజినెస్ మేన్ నితిన్ రాజును
ఆమె వివాహం చేసుకుంది. నితిన్ కు చెందిన ఫామ్ హౌజ్ లోనే ప్రణీత పెళ్లి గుంభనంగా జరిగిపోయింది.
అటుఇటు కలిపి ఓ 10 మంది మాత్రమే పెళ్లికి హాజరయ్యారు.

అయితే ప్రణీత పెళ్లి ఇలా సీక్రెట్ గా జరగడానికి ఓ కారణం ఉంది. ఆమె పెళ్లికి అధికారులు పర్మిషన్
ఇవ్వలేదు. చాన్నాళ్లుగా ప్రయత్నించగా.. 29వే తేదీ రాత్రి అనుమతి వచ్చింది. దీంతో 30వ తేదీన పెళ్లి
చేసుకుంది ప్రణీత.

First Published:  31 May 2021 1:34 PM IST
Next Story