Telugu Global
Cinema & Entertainment

చెప్పిన తేదీకే కేజీఎఫ్2

గతంలో ప్రకటించినట్టుగానే కేజీఎఫ్ 2 జులై లో రిలీజ్ అవుతుందా? లేదా అనే ప్రశ్న ప్రస్తుతం సినిమా అభిమానుల్లో ఉంది. అయితే ఎప్పటికప్పుడు అదే డేట్ చెప్తూ క్లారిటీ ఇస్తున్నారు మేకర్స్. తాజాగా మరోసారి అదే పని చేశారు. తమ సినిమా చెప్పిన తేదీకి వస్తుందని పరోక్షంగా ప్రకటించారు. సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రకాష్ రాజ్, రావు రమేష్ లకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ పోస్టర్లు విడుదల చేసింది కేజీఎఫ్ యూనిట్. తాజాగా నటుడు బాలకృష్ణ నీలకంఠపురం […]

చెప్పిన తేదీకే కేజీఎఫ్2
X

గతంలో ప్రకటించినట్టుగానే కేజీఎఫ్ 2 జులై లో రిలీజ్ అవుతుందా? లేదా అనే ప్రశ్న ప్రస్తుతం సినిమా
అభిమానుల్లో ఉంది. అయితే ఎప్పటికప్పుడు అదే డేట్ చెప్తూ క్లారిటీ ఇస్తున్నారు మేకర్స్. తాజాగా
మరోసారి అదే పని చేశారు. తమ సినిమా చెప్పిన తేదీకి వస్తుందని పరోక్షంగా ప్రకటించారు.

సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రకాష్ రాజ్, రావు రమేష్ లకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ
పోస్టర్లు విడుదల చేసింది కేజీఎఫ్ యూనిట్. తాజాగా నటుడు బాలకృష్ణ నీలకంఠపురం ని విష్ చేస్తూ
కూడా పోస్టర్ రిలీజ్ చేశారు.

సినిమాలో బాలకృష్ణ నీలకంఠపురం ఖలీల్ అనే పాత్ర చేస్తున్నట్లు తెలియజేస్తూ అతని క్యారెక్టర్ గురించి
హింట్ ఇచ్చేలా పోస్టర్ వదిలారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ విషెస్ పోస్టర్స్ లో జులై16న విడుదల
అంటూ స్టాంప్ వేశారు. దీంతో సినిమా జులైలో థియేటర్స్ లోకి రావడం పక్కా అనే విషయాన్ని యూనిట్
పరోక్షంగా వెల్లడించినట్టయింది.

First Published:  31 May 2021 1:37 PM IST
Next Story