Telugu Global
NEWS

ఆనందయ్య మందుకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..

ఆనందయ్య ఆయుర్వేదం మందు పంపిణీకి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీసీఆర్ఏఎస్ నివేదిక ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అయితే ఆనందయ్య పంపిణీ చేసే మందుల్లో కంట్లో వేసే చుక్కల మందు మినహా మిగతా వాటిని పంపిణీ చేసుకోవచ్చని చెప్పింది. చుక్కల మందు విషయంలో ఇంకా సీసీఆర్ఏఎస్ స్పష్టత ఇవ్వలేదని, అందుకే.. రాష్ట్ర ప్రభుత్వం కూడా చుక్కల మందుపై నిర్ణయం తీసుకోలేదని అధికారులు తెలిపారు. కొవిడ్ తగ్గుతుందనడానికి రుజువుల్లేవు.. ఆనందయ్య మందు వాడితే […]

ఆనందయ్య మందుకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..
X

ఆనందయ్య ఆయుర్వేదం మందు పంపిణీకి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీసీఆర్ఏఎస్ నివేదిక ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అయితే ఆనందయ్య పంపిణీ చేసే మందుల్లో కంట్లో వేసే చుక్కల మందు మినహా మిగతా వాటిని పంపిణీ చేసుకోవచ్చని చెప్పింది. చుక్కల మందు విషయంలో ఇంకా సీసీఆర్ఏఎస్ స్పష్టత ఇవ్వలేదని, అందుకే.. రాష్ట్ర ప్రభుత్వం కూడా చుక్కల మందుపై నిర్ణయం తీసుకోలేదని అధికారులు తెలిపారు.

కొవిడ్ తగ్గుతుందనడానికి రుజువుల్లేవు..
ఆనందయ్య మందు వాడితే కరోనా వ్యాధి నయమైపోతుందనడానికి రుజువులు లేవని, అదే సమయంలో ఆయన ఇచ్చే ఆయుర్వేదం మందు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావని తేలిందని అందుకే దాని పంపిణీకి అనుమతిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కొవిడ్ రోగులు ఆనందయ్య మందు వాడుతున్నా కూడా డాక్టర్ల దగ్గర వైద్యం తీసుకోవాలని స్పష్టం చేసింది. డాక్టర్ల వైద్యం తీసుకుంటూ, ఆనందయ్య మందుకూడా వాడొచ్చని చెప్పింది.

కొవిడ్ రోగులు కృష్ణపట్నం రావొద్దు..
కృష్ణపట్నం గ్రామంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొవిడ్ ప్రొటోకాల్ పాటిస్తూ ఆనందయ్య మందు పంపిణీ చేపట్ట వచ్చని అధికారులు తెలిపారు. అయితే ఆయుర్వేదం మందు తీసుకోడానికి కొవిడ్ రోగులెవరూ కృష్ణపట్నం రావొద్దని, వారి సంబంధీకులు మాత్రమే రావాలని స్పష్టం చేశారు.

కోటయ్య మృతి..
మరోవైపు ఆనందయ్య సొంత గ్రామం కృష్ణపట్నంలో ఒక్కసారిగా కరోనా కేసులు వెలుగులోకి రావడంతో కలకలం రేగింది. అటు నెల్లూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న కోటయ్య అనే రిటైర్డ్ హెడ్మాస్టర్ ఆనందయ్య మందు తీసుకుని, అంతా బాగుందనని ఇంటికి వెళ్లాక అనారోగ్యం తిరగబెట్టడంతో ఆస్పత్రిలో చేరి చివరకు కరోనాకు బలయ్యారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆయనలాగే.. దాదాపు 160మంది రోగులు ఆనందయ్య మందు తీసుకున్న తర్వాత కూడా కరోనా తగ్గకపోవడంతో నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

First Published:  31 May 2021 9:13 AM IST
Next Story