Telugu Global
NEWS

20 ఏళ్ల అభివృద్ధి.. రెండేళ్లలోనే సాకారం..

ముఖ్యమంత్రిగా తన రెండేళ్ల పాలనలోనే చరిత్రలో మిగిలిపోయే సువర్ణ ఘట్టాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారని అన్నారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రజలకిచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ నెరవేరుస్తున్నారని, ప్రతిక్షణం పేదల బాగోగుల కోసం శ్రమిస్తున్నారని చెప్పారు. కరోనా కష్టకాలంలో కూడా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆగలేదని గుర్తు చేశారు. వైఎస్ఆర్ చూపిన అభివృద్ధి బాటలో సీఎం జగన్ నడుస్తున్నారని, సచివాలయాల వ్యవస్థ ద్వారా గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేశారని అన్నారు. నిజాయతీ, నిబద్ధతతో […]

20 ఏళ్ల అభివృద్ధి.. రెండేళ్లలోనే సాకారం..
X

ముఖ్యమంత్రిగా తన రెండేళ్ల పాలనలోనే చరిత్రలో మిగిలిపోయే సువర్ణ ఘట్టాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారని అన్నారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రజలకిచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ నెరవేరుస్తున్నారని, ప్రతిక్షణం పేదల బాగోగుల కోసం శ్రమిస్తున్నారని చెప్పారు. కరోనా కష్టకాలంలో కూడా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆగలేదని గుర్తు చేశారు. వైఎస్ఆర్ చూపిన అభివృద్ధి బాటలో సీఎం జగన్ నడుస్తున్నారని, సచివాలయాల వ్యవస్థ ద్వారా గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేశారని అన్నారు. నిజాయతీ, నిబద్ధతతో కూడిన వ్యవస్థను సీఎం జగన్ పరిచయం చేశారన్నారు.

సంక్షేమ కార్యక్రమాల అమలుకి క్యాలెండర్ విడుదల చేసి మరీ అనుకున్న సమయానికి అన్ని కార్యక్రమాలు ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తెస్తోందని చెప్పారు సజ్జల రామకృష్ణారెడ్డి. రైతు భరోసా వంటి పథకాలతో అన్నదాతలు సంతోషంగా ఉన్నారని, విద్యావ్యవస్థలో నాడు-నేడు కార్యక్రమంతో సమూల మార్పులకు శ్రీకారం చుట్టామని, కొత్తగా 16 మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తెస్తూ.. వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని చెప్పారు సజ్జల.

రాష్ట్ర ప్రజలందర్నీ సీఎం జగన్ తన కుటుంబంగా భావిస్తున్నారని, అప్పుల భారం పడకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నారని చెప్పారు. ఐదేళ్లలోనే ఇచ్చిన హామీలన్ని నెరవేర్చాలని సీఎం నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు. సాగునీటి ప్రాజెక్ట్ లు, పోర్ట్ లు, పరిశ్రమల ఏర్పాటు.. వంటి విషయాలపై జగన్ అత్యంత శ్రద్ధ చూపిస్తున్నారని చెప్పారు.

99శాతం హామీలు అమలు చేశాం..
వైసీపీ రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో సజ్జల రామకృష్ణారెడ్డితోపాటు, మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. అభివృద్ధే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారాయన. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్ని 99శాతం మేర అమలులో పెట్టామని చెప్పారు. దీర్ఘకాలిక ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకెళ్తోందని పేర్కొన్నారు. దళారులు, మధ్యవర్తులు లేకుండా నేరుగా లబ్ధిదారులకే సంక్షేమ ఫలాలు అందించే విధానం గతంలో ఎన్నడూ లేదని చెప్పారు. ప్రజలకు అందించిన సంక్షేమంపై ప్రతి ఇంటికీ బుక్ లెట్ పంపిస్తామని అన్నారు మంత్రి బొత్స.

First Published:  30 May 2021 3:09 PM IST
Next Story