రాశిఖన్నా కరోనా కష్టాలు
దేశమంతా సెకెండ్ వేవ్ తో అష్టకష్టాలు పడుతుంటే, ఇలాంటి భయానక పరిస్థితుల మధ్య రాశిఖన్నా ఇటలీ వెళ్లింది. అక్కడ ఓ సినిమాలో నటించింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మాస్క్ తీసేసి షూటింగ్ చేయడం చాలా కష్టమని అంటోంది ఈ ముద్దుగుమ్మ. తన ఇటలీ షూటింగ్ దుర్భర పరిస్థితుల్ని బయటపెట్టింది. “సెకెండ్ వేవ్ టైమ్ లో ఇంటి నుంచి బయటకు రావడానికి భయమేసింది. అలాంటి దేశం దాటి ఇటలీకి వెళ్లాల్సి వచ్చింది. ఇటలీలో కూడా కొన్ని ప్రాంతాల్లో కరోనా […]
దేశమంతా సెకెండ్ వేవ్ తో అష్టకష్టాలు పడుతుంటే, ఇలాంటి భయానక పరిస్థితుల మధ్య రాశిఖన్నా
ఇటలీ వెళ్లింది. అక్కడ ఓ సినిమాలో నటించింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మాస్క్ తీసేసి షూటింగ్
చేయడం చాలా కష్టమని అంటోంది ఈ ముద్దుగుమ్మ. తన ఇటలీ షూటింగ్ దుర్భర పరిస్థితుల్ని
బయటపెట్టింది.
“సెకెండ్ వేవ్ టైమ్ లో ఇంటి నుంచి బయటకు రావడానికి భయమేసింది. అలాంటి దేశం దాటి ఇటలీకి
వెళ్లాల్సి వచ్చింది. ఇటలీలో కూడా కొన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు బయటపడ్డంతో మాకు భయమేసింది.
కొన్ని చోట్ల మాకు షూటింగ్ కు అనుమతి కూడా ఇవ్వలేదు. అయినా రిస్క్ చేసి షూటింగ్ చేశాం. రోజుకు
18 గంటలు కష్టపడిన సందర్భాలు కూడా ఉన్నాయి.”
రాశిఖన్నా అంతలా కష్టపడిన ఆ సినిమా పేరు థ్యాంక్ యు. దిల్ రాజు బ్యానర్ పై నాగచైతన్య హీరోగా
తెరకెక్కుతోంది ఈ సినిమా. ఈ మూవీతో పాటు ప్రస్తుతం గోపీచంద్ హీరోగా పక్కా కమర్షియల్ అనే
సినిమాలో కూడా నటిస్తోంది రాశిఖన్నా.