Telugu Global
National

సోనూ సూద్​ మరో సంచలన నిర్ణయం.. దేశంలో ఎక్కడికైనా డీటీడీసీ ద్వారా ఆక్సిజన్​ సరఫరా

ప్రముఖ నటుడు సోనూ సూద్​ కరోనా లాక్​డౌన్​ సమయంలో ప్రజలకు ఆపద్భాందవుడయ్యారు. దేశంలో ఎక్కడ ప్రజలు కష్టాల్లో ఉన్నా వాళ్లను ఆదుకుంటున్నారు. కరోనా ఫస్ట్​వేవ్​ టైంలో నిరుపేదలు, వలసకూలీలను ఆదుకున్న సోనూ సూద్​.. సెకండ్​వేవ్​లో ఆక్సిజన్​ కోసం ఇబ్బందులు పడుతున్న కోవిడ్​ బాధితులను ఆదుకుంటున్నారు. ఇప్పటికే ముంబై, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఆక్సిజన్​ కొరతతో బాధపడుతున్నవాళ్లకు ఆక్సిజన్​ కాన్సంట్రేటర్లు అందించారు. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా తన సేవలు విస్తరించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఏ ప్రాంతంలో […]

సోనూ సూద్​ మరో సంచలన నిర్ణయం.. దేశంలో ఎక్కడికైనా డీటీడీసీ ద్వారా ఆక్సిజన్​ సరఫరా
X

ప్రముఖ నటుడు సోనూ సూద్​ కరోనా లాక్​డౌన్​ సమయంలో ప్రజలకు ఆపద్భాందవుడయ్యారు. దేశంలో ఎక్కడ ప్రజలు కష్టాల్లో ఉన్నా వాళ్లను ఆదుకుంటున్నారు. కరోనా ఫస్ట్​వేవ్​ టైంలో నిరుపేదలు, వలసకూలీలను ఆదుకున్న సోనూ సూద్​.. సెకండ్​వేవ్​లో ఆక్సిజన్​ కోసం ఇబ్బందులు పడుతున్న కోవిడ్​ బాధితులను ఆదుకుంటున్నారు.

ఇప్పటికే ముంబై, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఆక్సిజన్​ కొరతతో బాధపడుతున్నవాళ్లకు ఆక్సిజన్​ కాన్సంట్రేటర్లు అందించారు. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా తన సేవలు విస్తరించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నవారికి ఆక్సిజన్​ అవసరమొచ్చినా.. www.umeedbysonusood.com లో సంప్రదించాలని.. అడ్రెస్​ చెబితే డీటీడీసీ కొరియర్​ సర్వీస్ ద్వారా వారి ఇంటికే ఆక్సిజన్ ​కాన్సంట్రేటర్లు సరఫరా చేస్తామని సోనూ సూద్​ పేర్కొన్నారు.

ప్రస్తుతం దేశంలోని పలు ఆస్పత్రుల్లో ఆక్సిజన కొరత ఏర్పడ్డ విషయం తెలిసిందే. ఓ వైపు ప్రభుత్వాలు కూడా చేతులెత్తేసిన పరిస్థితి నెలకొన్నది.మరోవైపు ప్రైవేట్​ ఆస్పత్రులు లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఈ పరిస్థితుల మధ్య సోనూ సూద్​ పేద ప్రజల పాలిట దేవుడయ్యారు. సాయం అని అడిగిన వెంటనే డబ్బుకు వెనకాడకుండా సాయం అందిస్తున్నారు. ఏ రాష్ట్రమైనా, ఏ ప్రాంతమైనా సరే ఓ వ్యక్తి కష్టాల్లో ఉన్నాడు.. అని తెలిసిన వెంటనే సాయం చేస్తున్నారు.

సోనూ సూద్​ చారిటబుల్​ ట్రస్ట్​ పేరిట ఆయన సేవలు చేస్తున్నారు. ఆక్సిజన్​ కాన్సంట్రేటర్లు అవసరమైన వాళ్లు .. తమ వివరాలను వెబ్​సైట్​లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత నేరుగా వారు చెప్పిన అడ్రస్​కు​ కాన్సంట్రేటర్లు పంపుతారు. సోనూ సూద్​ ట్రస్ట్​ ఎన్నో సేవలు చేస్తోంది. ఆక్సిజన్​ అందించడమే కాక.. కరోనా బాధితులకు పౌష్టికాహారం కూడా అందిస్తున్నది.

లాక్ డౌన్​తో ఉపాధి కోల్పోయిన వారికి తమవంతు సాయం అందిస్తున్నది. ఈ లాక్​డౌన్​ టైంలో సోనూ సూద్​ సేవలకు ఎల్లలు లేకుండా పోయాయి. ఆయనకు అన్ని వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

First Published:  29 May 2021 7:21 AM IST
Next Story