Telugu Global
International

కరోనా తర్వాతే కష్టకాలమంతా..

భారత దేశంలో కరోనా సోకినవారిలో మరణాల శాతం 1.14, అదే సమయంలో కరోనానుంచి కోలుకుని.. రకరకాల బ్యాక్టీరియా, ఫంగస్ వ్యాధులకు గురైనవారిలో మరణాల శాతం 56.7. ఈ గణాంకాలు ఐసీఎంఆర్ అధ్యయనంలో తేలినవే. పోస్ట్ కొవిడ్ ఎఫెక్ట్స్ పై ఇప్పటికే వైద్యులకు అవగాహన ఉన్నా.. దీని నివారణ మాత్రం సాధ్యం కావడంలేదు. మానవ శరీరంలో కరోనా వైరస్ బతికి ఉండే కాలం కేవలం 14రోజులు మాత్రమే. పారాసెట్మాల్ వాడినా, అనారోగ్యం ముదిరి స్టెరాయిడ్స్ వాడినా.. 14రోజుల తర్వాత […]

కరోనా తర్వాతే కష్టకాలమంతా..
X

భారత దేశంలో కరోనా సోకినవారిలో మరణాల శాతం 1.14, అదే సమయంలో కరోనానుంచి కోలుకుని.. రకరకాల బ్యాక్టీరియా, ఫంగస్ వ్యాధులకు గురైనవారిలో మరణాల శాతం 56.7. ఈ గణాంకాలు ఐసీఎంఆర్ అధ్యయనంలో తేలినవే. పోస్ట్ కొవిడ్ ఎఫెక్ట్స్ పై ఇప్పటికే వైద్యులకు అవగాహన ఉన్నా.. దీని నివారణ మాత్రం సాధ్యం కావడంలేదు. మానవ శరీరంలో కరోనా వైరస్ బతికి ఉండే కాలం కేవలం 14రోజులు మాత్రమే. పారాసెట్మాల్ వాడినా, అనారోగ్యం ముదిరి స్టెరాయిడ్స్ వాడినా.. 14రోజుల తర్వాత కరోనా టెస్ట్ చేయిస్తే నెగెటివ్ రిపోర్ట్ రావాల్సిందే. అయితే ఈలోపుగానే అంతా జరిగిపోతోంది. కరోనా సోకిన తర్వాత రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, చికిత్సలో భాగంగా వాడే మందులతో ఇతరత్రా సమస్యలు ఉత్పన్నం కావడంతో రోగులకు ముప్పు పెరుగుతోంది. కొవిడ్ తర్వాత అనారోగ్యంపాలైన వారిలో సగానికంటే ఎక్కువమంది చనిపోతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

కరోనా చికిత్స తీసుకుంటున్న సందర్భంలో కొవిడ్‌ రోగులు ఆస్ప్రతిలో బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడుతున్నట్లు ఐసీఎంఆర్ అధ్యయనంలో తేలింది. మొత్తం 17,534మందిపై ఈ పరిశోధన సాగగా.. వారిలో 3.6శాతం మంది కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత ఇతరత్రా వ్యాధులబారిన పడినట్టు తేలింది. గతంలో ఉన్న వ్యాధులు తిరగబెట్టినవారు కొంతమంది కాగా, కొత్తగా బ్యాక్టీరియా, ఫంగస్ బారిన పడినవారు కూడా ఉన్నారు. ఇలా కొవిడ్ తర్వాత ఇబ్బంది పడుతున్నవారిలో సగంకంటే తక్కువమందే తిరిగి కోలుకుంటున్నారు. 56.7శాతం మంది మరణిస్తున్నారు. వీరిలో ఎక్కువమంది ఐసీయూలో చికిత్స తీసుకున్నవారే కావడం గమనార్హం. సెకండరీ ఇన్‌ ఫెక్షన్లలో రక్తం, శ్వాస వ్యవస్థ ఎక్కువగా ప్రభావితం అవుతున్నట్లు ఐసీఎంఆర్ బృందం కనుగొంది. కొవిడ్ చికిత్స సందర్భంగా యాంటీ బయాటిక్స్‌, స్టెరాయిడ్స్ అతిగా ఉపయోగించడం వల్ల రోగుల్లో తీవ్రమైన దుష్ప్రభావాలు తలెత్తుతున్నాయని, తద్వారా మందులకు శరీరం స్పందించడంలేదని తెలిపింది.

ఈ అధ్యయనం ద్వారా ఐసీఎంఆర్ చేస్తున్న హెచ్చరికలు ఏంటంటే..
– వీలైనంత వరకు ఐసీయూ, ఆక్సిజన్ బెడ్ వరకు వెళ్లే పరిస్థితి రాకుండా ముందుగానే కొవిడ్ ని నిర్ధారణ చేసుకుని చికిత్స తీసుకోవాలి.
– జ్వరంతో సహా ఇతర వ్యాధి లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా మందులు వేసుకోవాలి.
– రోజుల తరబడి జ్వరం తగ్గకపోయినా, శ్వాస తీసుకోవ‌డంలో సమస్య ఎదురైనా ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.
– దాదాపుగా ఈ దశలోనే చాలామంది నిర్లక్ష్యంతో, వైద్య సహాయం అందుబాటులో లేక ఆస్పత్రులకు వెళ్లడంలేదు. సొంతవైద్యంపైనే ఆధారపడి.. ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తుల్లో చేరి వ్యాధి తీవ్రం అయ్యే వరకు పట్టీ పట్టనట్టు ఉంటున్నారు. వీరిని చివరి నిమిషంలో ఆస్పత్రులకు తీసుకెళ్లడం, ఐసీయూలో పెట్టడం, తర్వాతి పరిణామాలు అందరికీ తెలిసినే. అందుకే వీలైనంత త్వరగా చికిత్స మొదలు పెట్టడం, కొవిడ్ నుంచి ప్రాణాపాయాన్ని తప్పించుకోడానికి ఉన్న ఏకైక మార్గం. లేకపోతే కొవిడ్ శరీరంలోనుంచి బయటకు వెళ్లిపోయినా.. ఆ తర్వాత వచ్చే సమస్యలు ప్రాణాంతకంగా మారుతున్నాయి.

First Published:  28 May 2021 9:42 PM GMT
Next Story