సోనూసూద్ కు ఇంజెక్షన్లు ఎక్కడివి? కోర్టు ప్రశ్న..!
కరోనా వేళ ప్రముఖ నటుడు సోనూసూద్ ఎందరో పేద ప్రజల ప్రాణాలు కాపాడిన విషయం తెలిసిందే. దీంతో అతడికి దేశవ్యాప్తంగా పేరొచ్చింది. ఇదిలా ఉంటే ఆక్సిజన్ కోసం ప్రభుత్వాలు ఇబ్బంది పడుతున్న వేళ సోనూసూద్ కు ఆక్సిజన్ ఎక్కడి నుంచి వచ్చిందని ఇప్పటికే పలువురు ప్రశ్నించారు. మరోవైపు అతడికి కరోనా మందులు, ఇంజెక్షన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని.. ఇందులో ఏదైనా బ్లాక్‌మార్కెట్ ఉందా? అంటూ నేరుగా హైకోర్టే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రస్తుతం కరోనా వేళ.. సెలబ్రిటీలు, […]
కరోనా వేళ ప్రముఖ నటుడు సోనూసూద్ ఎందరో పేద ప్రజల ప్రాణాలు కాపాడిన విషయం తెలిసిందే. దీంతో అతడికి దేశవ్యాప్తంగా పేరొచ్చింది. ఇదిలా ఉంటే ఆక్సిజన్ కోసం ప్రభుత్వాలు ఇబ్బంది పడుతున్న వేళ సోనూసూద్ కు ఆక్సిజన్ ఎక్కడి నుంచి వచ్చిందని ఇప్పటికే పలువురు ప్రశ్నించారు.
మరోవైపు అతడికి కరోనా మందులు, ఇంజెక్షన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని.. ఇందులో ఏదైనా బ్లాక్‌మార్కెట్ ఉందా? అంటూ నేరుగా హైకోర్టే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రస్తుతం కరోనా వేళ.. సెలబ్రిటీలు, రాజకీయనేతలు మందులు పంపిణీ చేస్తుండటంపై కోర్టు విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా ఓ వైపు ప్రజలకు మందులు దొరకడంలేదు. మరి రాజకీయ నాయకులకు ఎలా దొరుకుతున్నాయి. కంపెనీలు నేరుగా వారికే ఇస్తున్నాయా? లేక ఇందులో ఏదైనా బ్లాక్‌మార్కెట్ ఉందా? అని ముంబై హైకోర్టు ప్రశ్నించింది. కోవిడ్ డ్రగ్స్ పై అథారిటీ కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని హైకోర్టు గుర్తు చేసింది.
‘ప్రజలకు మంచి చేయాలని భావించడంలో తప్పులేదు. కానీ ఈ క్రమంలో బ్లాక్‌దందా జరిగితే అది నేరమే’ అని హైకోర్టు పేర్కొన్నది. మరోవైపు పేద ప్రజలకు కోవిడ్ మందులు ఉచితంగా సరఫరా చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జీషన్ సిద్దిఖీ, సోనూసూద్ చారిటీకి కేంద్రం నోటీసులు జారీచేసింది.
అయితే దేశంలో పేద ప్రజలకు ఎంతో సేవ చేస్తున్న సోనూసూద్ కు నోటీసులు అందించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వాలు ఎలాగూ మందులు సరఫరా చేయవు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత ఉంది. రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లు ఉండవు. కానీ స్వచ్ఛందంగా సేవ చేసేవాళ్లకు ఇలా అడ్డంకులు సృష్టిస్తారు అంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.