Telugu Global
National

నవ్విపోదురుగాక మాకేటి..

వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరు ఇలాగే ఉంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ అత్యంత వేగంగా జరుగుతుందనుకున్న అమెరికాలో సైతం ఇప్పటి వరకూ కేవలం 49శాతం జనాభాకు మాత్రమే టీకాలు ఇచ్చారు. అమెరికాలో రోజుకి 18లక్షలమందికి టీకాలు వేస్తుండగా.. భారత్ లో కొన్ని రాష్ట్రాలు వారం రోజులపాటు వ్యాక్సినేషన్ ఆపేసిన సందర్భాలున్నాయి. ఈ దశలో కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ చేసిన ప్రకటన అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. కేంద్రం అవగాహనా రాహిత్యాన్ని చాటిచెప్పింది. దేశ ప్రజలందరికీ ఈ ఏడాది […]

నవ్విపోదురుగాక మాకేటి..
X

వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరు ఇలాగే ఉంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ అత్యంత వేగంగా జరుగుతుందనుకున్న అమెరికాలో సైతం ఇప్పటి వరకూ కేవలం 49శాతం జనాభాకు మాత్రమే టీకాలు ఇచ్చారు. అమెరికాలో రోజుకి 18లక్షలమందికి టీకాలు వేస్తుండగా.. భారత్ లో కొన్ని రాష్ట్రాలు వారం రోజులపాటు వ్యాక్సినేషన్ ఆపేసిన సందర్భాలున్నాయి. ఈ దశలో కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ చేసిన ప్రకటన అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. కేంద్రం అవగాహనా రాహిత్యాన్ని చాటిచెప్పింది.

దేశ ప్రజలందరికీ ఈ ఏడాది చివరినాటికి కొవిడ్ వ్యాక్సిన్‌ అందజేస్తామని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన బ్లూప్రింట్‌ ను కేంద్ర ఆరోగ్యశాఖ సిద్ధం చేసిందని చెప్పారు. డిసెంబర్‌ చివరినాటికి 108 కోట్ల జనాభాకు వ్యాక్సిన్‌ అందుతుందని ఆయన స్పష్టం చేశారు. భారత్ లో వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరు తెలిసి మాట్లాడారో లేక, గణాంకాలపై అవగాహనలేక మాట్లాడారో కానీ.. మొత్తానికి జవదేకర్ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. నెటిజన్లంతా ఆయన వ్యాఖ్యలపై సెటైర్లు పేలుస్తున్నారు.

రాష్ట్రాలు అడిగినంత వ్యాక్సిన్ సరఫరా చేయలేక, కంపెనీల ఉత్పత్తి సామర్థ్యం పెంచే ప్రణాళిక లేక కేంద్రం కొన్ని నెలలుగా తీవ్ర విమర్శలు మూటగట్టుకుంటోంది. మరోవైపు ఇతర దేశాల వ్యాక్సిన్లకు అనుమతినిచ్చే విషయంలోనూ మీనమేషాలు లెక్కిస్తోంది. ఈ దశలో ప్రకాష్ జవదేకర్ వ్యాఖ్యలు కలకలం రేపాయి.

భారత్ లో ఈ ఏడాది జనవరి 16న అధికారికంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైంది. కొవాక్సిన్, కొవిషీల్డ్ టీకాలను అప్పటినుంచి వినియోగిస్తున్నారు. 5నెలల కాలంలో ఇప్పటి వరకూ 20కోట్ల మందికి మాత్రమే వ్యాక్సినేషన్ పూర్తయింది. ఇదే స్పీడ్ లో వ్యాక్సినేషన్ కొనసాగినా, కొత్తగా వచ్చిన స్పుత్నిక్-వి ని లెక్కలోకి తీసుకున్నా.. ఏడాది చివరినాటికి వ్యాక్సిన్ తీసుకునేవారి సంఖ్య 50కోట్లకు చేరుకుంటుంది. మరి జవదేకర్ చెబుతున్న 108 కోట్ల లెక్క ఎలా తేలుతుందో ఆయనే చెప్పాలి.

First Published:  28 May 2021 5:02 PM IST
Next Story