Telugu Global
International

భూమి వేడెక్కుతోంది..

రానున్న కాలంలో మన భూమి మరింత వేడెక్కనుందని కొత్త స్టడీలు చెప్తున్నాయి. వచ్చే ఐదేళ్లలో ప్రపంచం 1.5- డిగ్రీల సెల్సియస్ వార్మింగ్ మార్కును దాటవచ్చని గురువారం విడుదల చేసిన గ్లోబల్ క్లైమెట్ ట్రెండ్స్ డేటా చెప్తోంది. రానున్న ఐదేళ్లలో సగటు ప్రపంచ ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల సెల్సియస్ మేరకు పెరిగేందుకు 40 శాతం వరకూ అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ చెప్తోంది. అలాగే 2021-నుంచి 2025 మధ్యలో ఏదైనా ఒక సంవత్సరం చరిత్రలోనే గరిష్ట ఉష్ణోగ్రత […]

భూమి వేడెక్కుతోంది..
X

రానున్న కాలంలో మన భూమి మరింత వేడెక్కనుందని కొత్త స్టడీలు చెప్తున్నాయి. వచ్చే ఐదేళ్లలో ప్రపంచం 1.5- డిగ్రీల సెల్సియస్ వార్మింగ్ మార్కును దాటవచ్చని గురువారం విడుదల చేసిన గ్లోబల్ క్లైమెట్ ట్రెండ్స్ డేటా చెప్తోంది.

రానున్న ఐదేళ్లలో సగటు ప్రపంచ ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల సెల్సియస్ మేరకు పెరిగేందుకు 40 శాతం వరకూ అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ చెప్తోంది. అలాగే 2021-నుంచి 2025 మధ్యలో ఏదైనా ఒక సంవత్సరం చరిత్రలోనే గరిష్ట ఉష్ణోగ్రత కలిగి ఉండే సంవత్సరంగా రికార్డుకెక్కే అవకాశం కూడా ఉందని పరిశోధనల్లో తేలింది.

భూమిపై పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, కరుగుతున్న మంచు ఖండాలు, అధిక సముద్ర మట్టాలు.. ఇలాంటి విపరీత వాతావరణ పరిస్థితులు మానవ జీవితంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. ఆహార భద్రత, ఆహార కొరత, దేశాల అభివృద్ధిపై వీటి ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

2015 పారిస్ క్లైమెట్ ఒప్పందం ప్రకారం ప్రపంచ దేశాలు భూమి ఉష్ణోగ్రతను 2 డిగ్రీల సెల్సియస్ కు తగ్గించేలా కృషి చేయాలి. కానీ ఇప్పుడు పరిస్థితి రివర్స్ లో ఉంది. పారిస్ క్లైమెట్ ఒప్పందం ప్రకారం దేశాలు చేసిన ప్రతిజ్ఞలు అన్నీ పక్కకు పోయాయి. ఇలానే వదిలేస్తే.. ఈ శతాబ్దం చివరినాటికి భూమి ఉష్ణోగ్రతలు అత్యంత వేడిగా మారి మానవాళి పై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి.

దీనిపై పర్యావరణ నిపుణులు మాట్లాడుతూ.. గ్లోబర్ వార్మింగ్ కోసం ఇప్పటి వరకు తీసుకుంటున్న చర్యలన్నీ అంతగా సరిపోట్లేదని, గ్లోబల్ వార్మింగ్‌ను ఆపడానికి ఉద్గారాలను సున్నాకి తగ్గించాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు.

First Published:  28 May 2021 8:17 AM IST
Next Story