Telugu Global
Cinema & Entertainment

పేపర్ బాయ్ డైరక్టర్ తో కాజల్

లాక్ డౌన్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఎనౌన్స్ చేయబోతోంది కాజల్. అందులో ఓ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ను మీకు ఎక్స్ క్లూజివ్ గా అందించబోతున్నాం. కెరీర్ లో ఫస్ట్ టైమ్ ఓ థ్రిల్లర్ సినిమాలో నటించబోతోంది ఈ ముద్దుగుమ్మ. దీనికి సంబంధించి రేపోమాపో అఫీషియల్ స్టేట్ మెంట్ రాబోతోంది. రీసెంట్ గా ఓటీటీలో ఓ హారర్ సిరీస్ చేసింది కాజల్. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో కాజల్ కు నమ్మకం పెరిగింది. అదే […]

పేపర్ బాయ్ డైరక్టర్ తో కాజల్
X

లాక్ డౌన్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఎనౌన్స్ చేయబోతోంది కాజల్. అందులో ఓ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ను మీకు ఎక్స్ క్లూజివ్ గా అందించబోతున్నాం. కెరీర్ లో ఫస్ట్ టైమ్ ఓ థ్రిల్లర్ సినిమాలో నటించబోతోంది ఈ ముద్దుగుమ్మ. దీనికి సంబంధించి రేపోమాపో అఫీషియల్ స్టేట్ మెంట్ రాబోతోంది.

రీసెంట్ గా ఓటీటీలో ఓ హారర్ సిరీస్ చేసింది కాజల్. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో కాజల్ కు నమ్మకం పెరిగింది. అదే నమ్మకంతో ఇప్పుడు థ్రిల్లర్ మూవీ చేయబోతోంది. అయితే ఇది ఓటీటీకి కాదు, సిల్వర్ స్క్రీన్ కోసం చేయబోయే ఫుల్ లెంగ్త్ మూవీ.

జయశంకర్ డైరక్షన్ లో ఈ థ్రిల్లర్ రాబోతోంది. గతంలో పేపర్ బాయ్ సినిమాతో సెన్సిబుల్ డైరక్టర్ అనిపించుకున్నాడు జయశంకర్. తర్వాత విటమిన్-షి అనే మరో మంచి సినిమా తీసి అందరి మెప్పు పొందాడు. ఇప్పుడు కాజల్ తో సరికొత్త కాన్సెప్ట్ తో థ్రిల్లర్ ప్లాన్ చేశాడు.

ఓ బడా నిర్మాత ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయబోతున్నాడు. మరిన్ని వివరాలు త్వరలోనే బయటకురాబోతున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే జులై నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వస్తుంది.

First Published:  28 May 2021 1:46 PM IST
Next Story