Telugu Global
NEWS

తెలంగాణలో జూలై 15 నుంచి ఇంటర్​ పరీక్షలు..!

తెలంగాణ రాష్ట్రంలో జూలై 15 నుంచి ఇంటర్మీడియట్​ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విద్యాశాఖకు తెలిపింది. కరోనా ఎఫెక్ట్​తో ఇంటర్మీడియట్​ పరీక్షలు వాయిదా పడ్డ విషయం తెలిసిందే. ఈ ఏడాది తరగతులు కూడా పెద్దగా సాగలేదు. కేవలం ఆన్​లైన్​ పాఠాలు మాత్రమే నిర్వహించారు. గత ఏడాది కరోనా రావడంతో ఇంటర్మీడియట్​ పరీక్షలు రద్దయ్యాయి. విద్యార్థులను ప్రమోట్​ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం ఆన్​లైన్​లో క్లాసులు జరిగాయి. కరోనా ఎఫెక్ట్​తో పరీక్షలు […]

తెలంగాణలో జూలై 15 నుంచి ఇంటర్​ పరీక్షలు..!
X

తెలంగాణ రాష్ట్రంలో జూలై 15 నుంచి ఇంటర్మీడియట్​ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విద్యాశాఖకు తెలిపింది. కరోనా ఎఫెక్ట్​తో ఇంటర్మీడియట్​ పరీక్షలు వాయిదా పడ్డ విషయం తెలిసిందే. ఈ ఏడాది తరగతులు కూడా పెద్దగా సాగలేదు. కేవలం ఆన్​లైన్​ పాఠాలు మాత్రమే నిర్వహించారు.

గత ఏడాది కరోనా రావడంతో ఇంటర్మీడియట్​ పరీక్షలు రద్దయ్యాయి. విద్యార్థులను ప్రమోట్​ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం ఆన్​లైన్​లో క్లాసులు జరిగాయి. కరోనా ఎఫెక్ట్​తో పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. ఇదిలా ఉంటే ఇంటర్మీడియట్​ పరీక్షలపై ఏ నిర్ణయం తీసుకున్నారో చెప్పాలంటూ ఇటీవల కేంద్ర విద్యాశాఖ రాష్ట్రాలను కోరింది.

ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి సందీప్​ కుమార్​ సుల్తానియా కేంద్రానికి లేఖ రాశారు. జూలై 15 నుంచి ఆగస్ట్​ చివరినాటికి తెలంగాణలో ఇంటర్మీడియట్​ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రానికి తెలిపారు. పరీక్ష సమయాన్ని 3 గంటల నుంచి గంటన్నరకు తగ్గించామని, సమయం తగ్గినందున రాయాల్సిన ప్రశ్నలనూ ఆ మేరకు తగ్గించినట్లు చెప్పారు. మార్కులను 100 కు
లెక్కిస్తామన్నారు.కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకొని పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.

ఈ నెల 29 వ తేదీ నుంచి ఇంటర్​ ద్వితీయ సంవత్సరం సైన్స్​ విద్యార్థులకు ప్రాక్టికల్స్​ జరగాల్సి ఉంది. అయితే వాటిని వాయిదా వేసినట్టు ఇంటర్ బోర్డు ప్రకటించింది. జూన్​ మొదటి వారంలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.

First Published:  28 May 2021 8:46 AM GMT
Next Story