ఢిల్లీలో లాక్‌డౌన్ ఎత్తివేత..!
కరోనా సెకండ్‌వేవ్‌లో దేశంలో ఎక్కువగా అతలాకుతలం అయిన రాష్ట్రాల్లో ఢిల్లీ కూడా ఒకటి. మహారాష్ట్రతో పాటు ఢిల్లీలోనూ అధిక సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఎంతో పకడ్బందీ చర్యలతో కరోనాను కంట్రోల్ చేయగలిగారు. లాక్‌డౌన్ విధించడం.. అందరికీ మెరుగైన వైద్యం అందించడం తదితర చర్యలతో ఢిల్లీలో ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టింది. దీంతో ఆ రాష్ట్రంలో లాక్‌డౌన్‌కు సడలింపులు విధించబోతున్నట్టు కేజ్రీవాల్ ప్రకటించారు. మే 31 నుంచి దశలవారీగా లాక్‌డౌన్ నిబంధనలు […]
కరోనా సెకండ్‌వేవ్‌లో దేశంలో ఎక్కువగా అతలాకుతలం అయిన రాష్ట్రాల్లో ఢిల్లీ కూడా ఒకటి. మహారాష్ట్రతో పాటు ఢిల్లీలోనూ అధిక సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఎంతో పకడ్బందీ చర్యలతో కరోనాను కంట్రోల్ చేయగలిగారు. లాక్‌డౌన్ విధించడం.. అందరికీ మెరుగైన వైద్యం అందించడం తదితర చర్యలతో ఢిల్లీలో ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టింది. దీంతో ఆ రాష్ట్రంలో లాక్‌డౌన్‌కు సడలింపులు విధించబోతున్నట్టు కేజ్రీవాల్ ప్రకటించారు.
మే 31 నుంచి దశలవారీగా లాక్‌డౌన్ నిబంధనలు సడలిస్తామని చెప్పారు. ఢిల్లీలో కరోనా పాజిటివిటీ రేటు 1.5 శాతానికి తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పారు. ఢిల్లీలో సోమవారం నుంచి పరిశ్రమల, నిర్మాణరంగంలో కార్యకలాపాలకు అనుమతులు ఇస్తున్నట్టు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘ ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కరోనాను అదుపులోకి తీసుకొచ్చేందుకు లాక్‌డౌన్ విధించాం. అయితే కరోనా లాక్‌డౌన్‌తో పరిశ్రమలు, నిర్మాణ రంగం మీద ఆధారపడ్డ చాలా మంది ఉపాధి కోల్పోయారు. వారికి ప్రభుత్వం, కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఇప్పటికే ఏదో రకంగా సాయం చేశాయి. కానీ వాళ్ల జీవనాధారాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. అందుకే రాష్ట్రంలో ఆకలి, నిరుద్యోగం పెరగకూడదని అనే ఉద్దేశంతో లాక్‌డౌన్ కు సడలింపులు ఇస్తున్నాం.
అయితే ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలి. కరోనా అన్‌లాక్‌కు ప్రజలు సహకరించాలి. కచ్చితంగా మాస్కులు ధరించాలి. భౌతికదూరం పాటించాలి. ఇప్పటికే వ్యాక్సినేషన్ కోసం కూడా ముమ్మరంగా ప్రయత్నాలు ఈ విషయంలో కేంద్రప్రభుత్వం సహకరించాల్సి ఉంది.
పాజిటివిటీ రేట్ అన్నది 1.5 శాతం కంటే తక్కువకు వచ్చేసింది. గత 24 గంటల్లో ఢిల్లీలో 1100 కేసులు మాత్రమే వచ్చాయి. ప్రస్తుతం ఉన్న లాక్ డౌన్ సోమవారం ఉదయం 5 గంటల వరకూ మాత్రమే అమలులో ఉంటుంది. అందుకే లాక్‌డౌన్‌కు సడలింపులు ఇచ్చాం’ అని ఆయన పేర్కొన్నారు.