ఏపీలో హెల్త్‌హబ్‌లు.. ! సీఎం జగన్ కీలక నిర్ణయం..!
ఆంధ్రప్రదేశ్‌లో సరైన వైద్య సదుపాయాలు లేవన్న విషయం తెలిసిందే. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఇటీవల కరోనా కేసులు పెరిగినప్పుడు ఏపీ ప్రజలు పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. అయితే తెలంగాణ బోర్డర్ వద్ద అంబులెన్స్‌లను కూడా ఆపేశారు. ఏపీలో వైద్యసదుపాయాలు ఎంత తక్కువగా ఉన్నాయో ఈ ఘటన అద్దం పట్టింది. ఇదిలా ఉంటే ఏపీలో ఆస్పత్రుల కొరత తీర్చేందుకు సీఎం జగన్మోహన్రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 16 చోట్ల హెల్త్‌హబ్‌లు ఏర్పాటు […]
ఆంధ్రప్రదేశ్‌లో సరైన వైద్య సదుపాయాలు లేవన్న విషయం తెలిసిందే. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఇటీవల కరోనా కేసులు పెరిగినప్పుడు ఏపీ ప్రజలు పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. అయితే తెలంగాణ బోర్డర్ వద్ద అంబులెన్స్‌లను కూడా ఆపేశారు. ఏపీలో వైద్యసదుపాయాలు ఎంత తక్కువగా ఉన్నాయో ఈ ఘటన అద్దం పట్టింది.
ఇదిలా ఉంటే ఏపీలో ఆస్పత్రుల కొరత తీర్చేందుకు సీఎం జగన్మోహన్రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 16 చోట్ల హెల్త్‌హబ్‌లు ఏర్పాటు చేయాలని ఆయన నిర్ణయించారు. విజయవాడ, తిరుపతి, రాజమండ్రి వంటి ప్రధాన నగరాలతో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లోనూ హెల్త్హబ్లను ఏర్పాటు చేయనున్నారు.
ఇందుకోసం ఒక్కో హెల్త్హబ్కు 30 నుంచి 50 ఎకరాల స్థలం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ హెల్త్ హబ్‌ల వల్ల ఏపీకి ఎంతో ప్రయోజనం కలుగుతుందని .. 10 మల్టీ, సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. అంతేకాక ఆంధ్రప్రదేశ్‌లో 16 మెడికల్, నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేయాలని కూడా సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.
శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్.. వైద్యశాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వ్యాక్సినేషన్, ఆనందయ్య మందు పంపిణీ తదితర అంశాలను చర్చించారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ పథకం అద్భుతంగా అమలవుతున్నదని సీఎం జగన్ చెప్పారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కిందే కోవిడ్ వైద్యం చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ఏపీలో గత రెండ్రోజులుగా కేసుల సంఖ్య తగ్గుతున్న విషయం తెలిసిందే. కరోనా సెకండ్‌వేవ్ ఆరంభంలో ఆక్సిజన్ కొరత వేధించింది. తిరుపతి రుయా ఆస్పత్రిల్లో ఆక్సిజన్ అందక పలువురు ప్రాణాలు కోల్పోయారు.
మరోవైపు మెరుగైన వైద్యం కోసం కోవిడ్ బాధితులు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు పరుగులు తీశారు. దీంతో వైద్య ఆరోగ్యశాఖ అలర్ట్ అయ్యింది. ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందించేలా చర్యలు చేపట్టింది. అంతేకాక.. ప్రైవేటు ఆస్పత్రుల్లో జరుగుతున్న దోపిడీపై కూడా ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది.