మరోసారి పాటపాడిన బాలయ్య
‘లవకుశ’ తెలుగు-తమిళ వెర్షన్లు, ‘సంపూర్ణ రామాయణం’ తమిళ వెర్షన్, ‘శ్రీకృష్ణ సత్య’, ‘శ్రీ రామాంజనేయ యుద్ధం’, ‘శ్రీరామ పట్టాభిషేకం’… ఆరు చిత్రాల్లో శ్రీరామ చంద్రుని పాత్రకు ఎన్టీఆర్ ప్రాణప్రతిష్ఠ చేశారు. తెలుగు ప్రజలను అలరించారు. ఇంకా, ‘అడవి రాముడు’, ‘చరణదాసి’, ‘చిట్టి చెల్లెలు’, ‘తిక్క శంకరయ్య’ మొదలగు పది చిత్రాల్లో అంతర్ నాటకాల్లో రాముడిగా కనిపించారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజల మనసుల్లో శ్రీరాముడిగా ముద్రించుకుపోయిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్. నేడు (మే 28) ఎన్టీఆర్ జయంతి. ఈ […]
‘లవకుశ’ తెలుగు-తమిళ వెర్షన్లు, ‘సంపూర్ణ రామాయణం’ తమిళ వెర్షన్, ‘శ్రీకృష్ణ సత్య’, ‘శ్రీ రామాంజనేయ
యుద్ధం’, ‘శ్రీరామ పట్టాభిషేకం’… ఆరు చిత్రాల్లో శ్రీరామ చంద్రుని పాత్రకు ఎన్టీఆర్ ప్రాణప్రతిష్ఠ చేశారు.
తెలుగు ప్రజలను అలరించారు. ఇంకా, ‘అడవి రాముడు’, ‘చరణదాసి’, ‘చిట్టి చెల్లెలు’, ‘తిక్క శంకరయ్య’
మొదలగు పది చిత్రాల్లో అంతర్ నాటకాల్లో రాముడిగా కనిపించారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజల
మనసుల్లో శ్రీరాముడిగా ముద్రించుకుపోయిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్.
నేడు (మే 28) ఎన్టీఆర్ జయంతి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కుమారుడు, బాలకృష్ణ శ్రీరామ దండకం
ఆలపించారు. క్లిష్టమైన, గ్రాంధిక పదాలు, ఒత్తులతో పలకడానికి కష్టమైన దండకాన్ని బాలకృష్ణ తనదైన
శైలిలో పాడి వినిపించారు. అవలీలగా ఆలపించారు. ఈ శ్రీరామ దండకం నిడివి: 3.15 నిమిషాలు. వినోద్
యాజమాన్య సంగీతం సమకూర్చారు.
నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ “ధర్మం లోపించిన సమయమిది. ధర్మానికి ప్రతిరూపం శ్రీరామ
చంద్రుడు. శ్రీరామ చంద్రుని పాత్రకు వెండితెరపై నాన్నగారు ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఈ సమయంలో ఆ
శ్రీరాముని మనం తలుచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే… నాన్నగారి జయంతి సందర్భంగా అందరికీ మంచి జరగాలని, స్వస్థత చేకూరాలని, కరోనా నుంచి ప్రపంచానికి విముక్తి కలగాలని శ్రీరామ దండకాన్ని ఆలపించాను” అని అన్నారు.