జపాన్‌లో ఫోర్త్ వేవ్.. ఇప్పుడెలా ఉందంటే..
వేవ్స్ రూపంలో ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా చాలా దేశాల్లో కరోనా రెండు మూడు వేవ్స్ కు పరిమితమైంది. అయితే ఇప్పుడు జపాన్ లో ఏకంగా ఫోర్త్ వేవ్ వచ్చింది. ఫోర్త్ వేవ్ ఇప్పుడు జపాన్ ను భయపెడుతోంది. ఫోర్త్ వేవ్ విజృంభించడంతో జపాన్ లోని ఒసాకా నగరం వణికిపోతోంది. దీంతో ఒసాకాతో పాటు మరో ఎనిమిది నగరాల్లో హెల్త్ ఎమర్జెన్సీ అమలు చేయనున్నారు. జపాన్‌లో ఇప్పటివరకు 7లక్షల 28వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, 12వేల మరణాలు […]
వేవ్స్ రూపంలో ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా చాలా దేశాల్లో కరోనా రెండు మూడు వేవ్స్ కు పరిమితమైంది. అయితే ఇప్పుడు జపాన్ లో ఏకంగా ఫోర్త్ వేవ్ వచ్చింది. ఫోర్త్ వేవ్ ఇప్పుడు జపాన్ ను భయపెడుతోంది.
ఫోర్త్ వేవ్ విజృంభించడంతో జపాన్ లోని ఒసాకా నగరం వణికిపోతోంది. దీంతో ఒసాకాతో పాటు మరో ఎనిమిది నగరాల్లో హెల్త్ ఎమర్జెన్సీ అమలు చేయనున్నారు. జపాన్‌లో ఇప్పటివరకు 7లక్షల 28వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, 12వేల మరణాలు సంభవించాయి. వైరస్ వ్యాప్తిని వారు సమర్థవంతంగా నియంత్రించినప్పటికీ ఇప్పుడొచ్చిన కొత్త వేవ్ ఉధృతి ఎక్కువగా ఉండడం జపాన్‌ను ఆందోళనకు గురిచేస్తోంది.
జపాన్ లో ఈ వారం 3వేల 849 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే అక్కడి ఆసుపత్రుల్లో 95 శాతం బెడ్లు కరోనా పేషెంట్లతో నిండాయి. తాజాగా ఆసుపత్రుల్లో చేరుతున్న రోగుల్లో కూడా తీవ్ర లక్షణాలు కనిపిస్తుండడంతో పరిస్థితి కాస్త ఇబ్బందిగా మారినట్లు స్థానిక డాక్టర్లు చెప్తున్నారు. ఉన్నట్టుండి ఈ నెలలో ఒక్కసారిగా కరోనా తీవ్రత పెరగడానికి బ్రిటన్‌లో వెలుగు చూసిన కొత్తరకం కరోనా వైరస్ కారణమై ఉండొచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు.
ఇదిలా ఉంటే మరో తొమ్మిది వారాల్లో జపాన్‌లో ఒలింపిక్స్ నిర్వహించేందుకు అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ రెడీ అవుతోంది.అయితే ఒలింపిక్స్ మొదలయ్యేనాటికి గేమ్స్ జరిగే ప్రాంతాల్లో దాదాపు 80శాతం మందికి వ్యాక్సిన్ వేస్తామని ఒలింపిక్ కమిటీ ప్రకటించింది. కానీ 12 కోట్ల జనాభా ఉన్న జపాన్‌లో ఇప్పటివరకు కేవలం 2 నుంచి 3శాతం మందికే వ్యాక్సిన్ అందించారు. ఒకపక్క ఒలింపిక్స్ కు సమయం దగ్గరపడుతుండడం, మరోపక్క ఫోర్త్ వేవ్ రావడంతో జపాన్ తీవ్ర గందరగోళంలో ఉంది. ప్రస్తుతం భారీ స్థాయిలో వ్యాక్సినేషన్ చేపట్టేందుకు సిద్ధమైంది.