ఏ1గా రేవంత్.. ఈడీ చార్జ్‌షీట్..!
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటుకేసు మరోసారి తెరమీదకు వచ్చింది. ఈ కేసులో ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) తాజాగా చార్జ్‌షీట్ దాఖలు చేసింది. చార్జ్‌షీట్‌లో రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్, తదితరులపై అభియోగాలు నమోదయ్యాయి. ప్రధాన నిందితుడిగా ఈడీ రేవంత్‌రెడ్డిని పేర్కొన్నది. ఓటుకు నోటు కేసు రేవంత్‌రెడ్డిని 2015 నుంచి నీడలా వెంటాడుతోంది. ఇది రాజకీయకుట్రతో పెట్టారని పలుమార్లు రేవంత్ ఆరోపించారు. అయితే అప్పట్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్‌రెడ్డిని గెలిపించేందుకు […]
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటుకేసు మరోసారి తెరమీదకు వచ్చింది. ఈ కేసులో ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) తాజాగా చార్జ్‌షీట్ దాఖలు చేసింది. చార్జ్‌షీట్‌లో రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్, తదితరులపై అభియోగాలు నమోదయ్యాయి. ప్రధాన నిందితుడిగా ఈడీ రేవంత్‌రెడ్డిని పేర్కొన్నది.
ఓటుకు నోటు కేసు రేవంత్‌రెడ్డిని 2015 నుంచి నీడలా వెంటాడుతోంది. ఇది రాజకీయకుట్రతో పెట్టారని పలుమార్లు రేవంత్ ఆరోపించారు. అయితే అప్పట్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్‌రెడ్డిని గెలిపించేందుకు రేవంత్ రెడ్డి.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ. 50 లక్షలు లంచం ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా పలు టీవీ చానల్స్‌లో టెలికాస్ట్ అయ్యాయి.
ఈ కేసు వెనక మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారని కూడా వార్తలు వచ్చాయి. అప్పటినుంచి అవకాశం వచ్చిన ప్రతిసారి .. ప్రత్యర్థులు చంద్రబాబును టార్గెట్ చేస్తూ వచ్చారు. అయితే స్టీఫెన్సన్కు ఇచ్చిన రూ. 50 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారన్న విషయంపై విచారణ జరుగుతోంది. తాజాగా ఈ కేసులో ఈడీ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. రేవంత్‌రెడ్డి.. ఓ ఎమ్మెల్యేకు డబ్బులు ఇచ్చిన వీడియో అప్పట్లో సంచలనంగా మారింది.
ఈకేసులో రేవంత్ రెడ్డి కొంతకాలం రిమాండ్ ఖైదీగా జైలు జీవితం కూడా అనుభవించారు. తాజాగా ఈ కేసు మరోసారి తెరమీదకు రావడం గమనార్హం. అయితే అప్పట్లో చంద్రబాబుపైన కూడా ఆరోపణలు వచ్చాయి. ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తో చంద్రబాబు ఫోన్లో మాట్లాడినట్టు కూడా ఆడియో క్లిప్పింగులు బయటకువచ్చాయి. ఈ అంశాన్ని అప్పటి అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష నేత జగన్ ప్రస్తావించారు.
ఓటుకు నోటు కేసు అప్పటి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య మాటల యుద్ధం తీసుకొచ్చింది. అప్పట్లో ఇద్దరు నేతలు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. చివరకు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ను వదిలేసి అమరావతి కేంద్రంగానే కార్యకలాపాలు చేసుకున్నారు.