Telugu Global
National

ప్రభుత్వంపై కోర్టుకెక్కిన వాట్సాప్..

భారత ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఇంటర్నెట్ నిబంధనలపై వాట్సాప్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. భారత ప్రభుత్వంపై ఢిల్లీ హైకోర్టులో దావా వేసింది. ప్రభుత్వ నిర్ణయం వాట్సాప్ యాప్ గోప్యతకు ఆటంకం కలిగినట్లే అవుతుందని వెల్లడించింది. ప్రైవేట్ గా మెసేజ్ లను పంపుకునే కోట్లాది మంది ప్రజల గోప్యతను ఈ కొత్త రూల్స్ దెబ్బతీస్తాయని, అది రాజ్యాంగ విరుద్ధమని వాట్సాప్ పేర్కొంది. ప్రైవేట్ సందేశాలను ప్రభుత్వానికి ఇవ్వాల్సి వస్తే.. ఎండ్-టు-ఎండ్ సెక్యురిటీ దెబ్బ తింటుందని, దుర్వినియోగానికి దారితీస్తుందని వాట్సాప్ […]

ప్రభుత్వంపై కోర్టుకెక్కిన వాట్సాప్..
X

భారత ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఇంటర్నెట్ నిబంధనలపై వాట్సాప్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. భారత ప్రభుత్వంపై ఢిల్లీ హైకోర్టులో దావా వేసింది. ప్రభుత్వ నిర్ణయం వాట్సాప్ యాప్ గోప్యతకు ఆటంకం కలిగినట్లే అవుతుందని వెల్లడించింది.

ప్రైవేట్ గా మెసేజ్ లను పంపుకునే కోట్లాది మంది ప్రజల గోప్యతను ఈ కొత్త రూల్స్ దెబ్బతీస్తాయని, అది రాజ్యాంగ విరుద్ధమని వాట్సాప్ పేర్కొంది. ప్రైవేట్ సందేశాలను ప్రభుత్వానికి ఇవ్వాల్సి వస్తే.. ఎండ్-టు-ఎండ్ సెక్యురిటీ దెబ్బ తింటుందని, దుర్వినియోగానికి దారితీస్తుందని వాట్సాప్ చెప్తోంది. ప్రజల వ్యక్తిగత ప్రైవసీని పరిరక్షించడానికి వాట్సాప్ కట్టుబడి ఉందని, అలా చేయడానికి భారతదేశ చట్టాలలో మేము చేయగలిగినదంతా చేస్తూనే ఉంటామని కూడా వాట్సాప్ చెప్తోంది.

కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియాను కట్టడి చేసేందకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ కొత్త రూల్స్ నేటి నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. ఈ కొత్త రూల్స్ ప్రకారం.. నెటిజన్ల ఫిర్యాదులను పరిష్కరించడం, ఎవరైనా అభ్యంతరక కంటెంట్ పోస్ట్ చేస్తే తొలగించడం వంటివి చేయాలి. ఏదైనా పోస్ట్ లేదా మెసేజ్ గురించి ప్రభుత్వం అడిగితే వెంటనే ఆ వివరాలు ఇవ్వాలి. ఈ నిబంధనలు పాటించని కంపెనీలపై ప్రభుత్వం కేసులను కూడా పెడుతుంది.అయితే ఈ రూల్స్ కు ఫేస్‌బుక్, గూగుల్ ఒప్పుకోగా వాట్సాప్ మాత్రం కోర్టుకెక్కింది.

First Published:  26 May 2021 3:25 AM GMT
Next Story