Telugu Global
Cinema & Entertainment

ఎన్టీఆర్ కు కరోనా నెగెటివ్

హీరో ఎన్టీఆర్ కరోనా నుంచి కోలుకున్నాడు. 2 వారాలుగా హోం ఐసొలేషన్ లో ఉన్న ఈ హీరో, తనకు కరోనా నెగెటివ్ వచ్చినట్టు ప్రకటించాడు. తనకు వైద్యం చేసిన వైద్యులతో పాటు.. తన క్షేమం కోరుకున్న సన్నిహితులందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. ఈనెల 10న కరోనా బారిన పడ్డాడు ఎన్టీఆర్. ఆ విషయాన్ని తనే స్వయంగా ప్రకటించి ఐసొలేషన్ లోకి వెళ్లిపోయాడు. అయితే ఎన్టీఆర్ కు పెద్దగా కరోనా లక్షణాల్లేవు. దీంతో అతడికి చికిత్స అందించడం డాక్టర్లకు సులభం […]

ఎన్టీఆర్ కు కరోనా నెగెటివ్
X

హీరో ఎన్టీఆర్ కరోనా నుంచి కోలుకున్నాడు. 2 వారాలుగా హోం ఐసొలేషన్ లో ఉన్న ఈ హీరో, తనకు
కరోనా నెగెటివ్ వచ్చినట్టు ప్రకటించాడు. తనకు వైద్యం చేసిన వైద్యులతో పాటు.. తన క్షేమం కోరుకున్న
సన్నిహితులందరికీ కృతజ్ఞతలు తెలిపాడు.

ఈనెల 10న కరోనా బారిన పడ్డాడు ఎన్టీఆర్. ఆ విషయాన్ని తనే స్వయంగా ప్రకటించి ఐసొలేషన్ లోకి
వెళ్లిపోయాడు. అయితే ఎన్టీఆర్ కు పెద్దగా కరోనా లక్షణాల్లేవు. దీంతో అతడికి చికిత్స అందించడం
డాక్టర్లకు సులభం అయింది. ఈ ఐసొలేషన్ లోనే తన పుట్టినరోజును కూడా సెలబ్రేట్ చేసుకున్నాడు ఈ
హీరో.

త్వరలోనే ఆర్ఆర్ఆర్ సెట్స్ లో జాయిన్ అవ్వబోతున్నాడు ఎన్టీఆర్. రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా
తెరకెక్కుతోంది. ఈ మూవీ పూర్తిచేసి కొరటాల శివ దర్శకత్వంలో మరో మూవీ చేయబోతున్నాడు. ఆ
తర్వాత కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సినిమా ఉంటుంది.

First Published:  25 May 2021 1:38 PM IST
Next Story