Telugu Global
Cinema & Entertainment

ఆచార్య సెకెండ్ హీరో రామ్ చరణ్

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఆచార్య సినిమా. ఇందులో చిరంజీవి హీరో అనే విషయం అందరికీ తెలిసిందే. రామ్ చరణ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయంపై స్పందించిన కొరటాల.. రామ్ చరణ్ ది కీలక పాత్ర అనే కంటే సెకెండ్ హీరో అనడం కరెక్ట్ అంటున్నాడు. అవును.. అంతా అనుకుంటున్నట్టు ఆచార్యలో రామ్ చరణ్ 25 నిమిషాలు మాత్రమే కనిపించడట. సినిమా ద్వితీయార్థం మొత్తం కనిపిస్తాడట చరణ్. […]

acharya chiranjeevi ramcharan 2
X

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఆచార్య సినిమా. ఇందులో చిరంజీవి హీరో అనే విషయం అందరికీ తెలిసిందే. రామ్ చరణ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయంపై స్పందించిన కొరటాల.. రామ్ చరణ్ ది కీలక పాత్ర అనే కంటే సెకెండ్ హీరో అనడం కరెక్ట్ అంటున్నాడు.

అవును.. అంతా అనుకుంటున్నట్టు ఆచార్యలో రామ్ చరణ్ 25 నిమిషాలు మాత్రమే కనిపించడట. సినిమా ద్వితీయార్థం మొత్తం కనిపిస్తాడట చరణ్. ఈ లెక్కన చూసుకుంటే రామ్ చరణ్, ఆచార్యలో సెకండ్ హీరో కింద లెక్క. ఇదే విషయాన్ని కొరటాల ప్రస్తావించాడు.

ఆచార్య సినిమా కథ మొత్తం రామ్ చరణ్ చుట్టూ తిరుగుతుందట. చరణ్ ప్రారంభించిన ఓ మిషన్ ను చిరంజీవి ఎలా పూర్తిచేశాడనేది ఆచార్య స్టోరీలైన్. కాజల్, పూజాహెగ్డే ఇందులో హీరోయిన్లు.

First Published:  24 May 2021 1:48 PM IST
Next Story